Prabhas: అయోధ్య రామ మందిరం ఏర్పాటుకు మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న సంగతి మనకు తెలిసిందే . హిందువుల కల అయినటువంటి రామ మందిరం ఏర్పాటుకు ముహూర్తం కూడా నిర్ణయం చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పాల్గొనడమే కాకుండా అయోధ్యకు వచ్చే భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయబోతున్నారని దానికోసం ఈయన సుమారు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రభాస్ 50 కోట్ల వరకు విరాళం అందిస్తున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఆయన టీమ్ స్పందించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ టీమ్ స్పందిస్తూ అయోధ్య రామ మందిరం భోజన ఏర్పాట్లు కోసం ప్రభాస్ 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అంటూ వచ్చినటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కూడా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారడంతో ప్రభాస్ విరాళం గురించి అందరికీ క్లారిటీ వచ్చేసింది.
ఆ వార్తలన్నీ అవాస్తవం…
ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వంటి వారందరికీ కూడా ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన రాజా సాబ్ సినిమాతో పాటు కల్కి, స్పిరిట్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…