Featured

Tejaswini Reddy mother : నా కూతురు చివరగా మాట్లాడింది ఇదే…. చదువు కోసం వెళితే చంపేస్తారా….ప్రభుత్వం నా కూతురు శవాన్ని త్వరగా ఇండియాకి రప్పించాలి….: తేజస్విని రెడ్డి తల్లి

Tejaswini Reddy mother : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల తేజస్విని రెడ్డి లండన్ లో ఏంఎస్ చేయడానికి రెండేళ్ల క్రితం వెళ్ళింది. అయితే తాజాగా ఆమె చదువు అయిపోయి తిరిగి ఇండియా రావాల్సిన ఉండగా ఇంతలోనే ఒక కిరాతకుడు ఆమెను హత్య చేసాడు. స్థానిక వెంబ్లే ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌కే చెందిన బ్రెజిల్ కి చెందిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు . లండన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. విషయం తెలిసీ తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. త్వరలో తేజస్విని కి పెళ్లి చేయాలని అనుకుంటుండగా ఇలా జరిగిందని బాధపడ్డారు.

చదువు కోసం వెళితే ఇలా చంపేస్తారా….

తేజస్విని రెడ్డి మరణ వార్త విని ఆమె తల్లి కుప్పకూలి పోయారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నా కూతురు చదువుకోడానికి లండన్ వెళ్ళింది. ఇంకొద్ది రోజుల్లో ఇండియా తిరిగి వస్తుందని అనుకుంటే ఇంతలో ఇలాంటిది వినాల్సివచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. తేజస్విని తో పాటు తేజస్విని కజిన్స్ కూడా లండన్ లో ఉన్నారని అయితే అబ్బాయిలందరు స్నేహితుల వద్ద ఉండగా తేజ వేరే అపార్ట్మెంట్ లో ఉండాల్సి వచ్చిందని రెండు నెలల క్రితమే తాను పనిచేసే చోటుకు దగ్గరగా ఉంటుందని వెళ్లిందని అక్కడ మన తెలుగమ్మాయి అఖిల పరిచయమైందని ఇద్దరు బాగా ఉండేవారు ఆ అమ్మాయి అఖిల అక్కడ రెండేళ్లుగా ఉండేదనీ చెప్పారు తేజ తల్లి.

అయితే హత్య జరిగిన రోజు అంతకుముందే కూతురితో మాట్లాడినట్లు నాన్నతో మాట్లాడాలి అంటూ చాలా అడిగింది మళ్ళీ చేస్తానని చెప్పాను ఇంతలో ఇలా జరిగింది. ఫుడ్డు కూడా బయట నుండి తెచ్చుకుని తిన్నారు స్నేహితులు ఇద్దరు. కిచెన్ లోకి ప్లేట్ పెట్టడానికి వెళ్లిన సమయంలో అప్పటికే అక్కడ తిరుగుతున్న ఆ బ్రెజిల్ దేశస్తుడు కెవిన్ కత్తితో విచక్షణారాహితంగా పొడిచాడు. అరిచేసరికి అఖిల వచ్చి అడ్డుకోవడంతో ఆ అమ్మాయిని పొడిచాడట. ఆ అమ్మయి ఆసుపత్రి లో చికిత్స పొంది నిన్న మళ్ళీ రూమ్ కి వచ్చింది. కానీ నా కూతురు అక్కడికక్కడే చనిపోయింది. నా కూతురు శవం అయినా తొందరగా ఇండియా వచ్చేలా చేయండి అంటూ కెసిఆర్ ప్రభత్వాన్ని ఏడుస్తూనే వేడుకొన్నారు తేజస్విని రెడ్డి తల్లి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago