Featured

ఈనెల 8న భేటీ కానున్న తెలంగాణ క్యాబినెట్..! పలు కీలక అంశాలపై చర్చ..!

రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8 న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్నది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అనే అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది.

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశమున్నది.

వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం పై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా రెండవ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో, ఇంకా కూడా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో, థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత తగు ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది.

కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది.

రేపటినుంచి (7 న) ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్‌ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సతీదేవి శరీరాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడు? ఆశ్చర్యకర గాథ!

హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…

1 hour ago

ఆలయం వెనుక రాక్షసులా? లేక దైవ శక్తా? పూర్తి వివరణ!

హిందూ ఆలయాలకు వెళ్లే భక్తులు సాధారణంగా గర్భగుడిలో స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ…

1 hour ago

పెళ్లిలో మూడు ముళ్లు ఎందుకు వేస్తారు? అసలు రహస్యం ఇదే!

హిందూ వివాహ సంప్రదాయం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చినా, దాని అంతర్భాగమైన ఆచారాలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.…

1 hour ago

గంగమ్మ రాత్రివేళ గోదావరిలో స్నానం చేస్తుందా? ఆసక్తికర విశ్వాసం!

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన…

2 hours ago

తులసి ఆకులు రంగు మారితే ఏమిటి సంకేతం? శుభమా? అశుభమా?

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో తులసిని దైవ స్వరూపంగా భావిస్తూ నిత్య…

2 hours ago

నవగ్రహాల ప్రదక్షిణ ఎలా చేయాలి? చాలామందికి తెలియని నియమాలు!

హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. మన జీవితంలోని అనేక పరిణామాలు గ్రహాల ప్రభావంతోనే జరుగుతాయని విశ్వాసం. అందుకే…

2 hours ago