తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాష్ట్ర కేబినెట్‌లో త్వరలో పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ముఖ్యంగా పనితీరు సరిగా లేని మంత్రులపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోందని, త్వరలోనే కొందరిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల కోసం లాబీయింగ్ కూడా వేడెక్కింది.
రాష్ట్ర మంత్రుల పనితీరు నివేదిక ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్‌కు చేరినట్లు తెలిసింది. ఆ నివేదిక ఆధారంగా పార్టీ ప్రధాన నేతలు త్వరలో సమీక్ష చేపట్టనున్నారు.
రాష్ట్రంలో బీసీ వర్గానికి మరింత ప్రాధాన్యం ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం కీలక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.
మహేష్ గౌడ్‌ను డిప్యూటీ సీఎంగా తీసుకుంటే, పీసీసీ అధ్యక్ష పదవికి పొన్నం ప్రభాకర్ పేరును ముందుకు తెచ్చే అవకాశం ఉందని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ మార్పులు అధికారికంగా వెలువడే అవకాశముంది.
బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ, కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో అమలు నిలిచిపోయింది. ఇప్పుడు అదే దిశగా రాజకీయ సంతృప్తి కలిగించేందుకు బీసీ నేతకు కీలక పదవి ఇవ్వాలనే ప్లాన్ బీని అమలు చేయాలని పార్టీ ఆలోచన. ఈ నిర్ణయాలను “సామాజిక సమతౌల్యాన్ని కాపాడే ప్రభుత్వం” అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేస్తోంది.
తెలంగాణలో త్వరలోనే కేబినెట్ రీషఫుల్ జరుగే అవకాశముంది. భట్టి విక్రమార్కతో పాటు మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎంగా ప్రమోట్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఈ మార్పులతో రాజకీయ సమీకరణాలను బలోపేతం చేయాలనే వ్యూహంలో ఉంది
రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…