Telugu Anchor: తెలుగు బుల్లితెరపై ఎంతో మంది గ్లామరస్ యాంకర్లు ఉన్నారు. సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి ఎంతోమంది ఫోటా పోటీగా బుల్లితెర కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు. అయితే వీరందరిలో కల్లా శ్రీముఖి మాత్రం కాస్త భిన్నం అని చెప్పాలి.ఇలా ఈమె ఒకవైపు వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే బుల్లితెరపై మాత్రం అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు.
ఇలా బుల్లితెర యాంకర్ గా ప్రతి ఒక్క ఛానల్ లోను ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఈమె ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇదివరకే ప్రసారమైన షోలో ఈమె సింగర్ శ్రీ చరణ్ తో లవ్ ట్రాక్ ఉన్నట్లు ఫ్రాంక్ చేశారు. అయితే అదంతా కూడా కేవలం టిఆర్పి కోసమేనని తేలిపోయింది. అయితే ప్రస్తుతం సరిగమప చాంపియన్ షిప్ నడుస్తోంది.
ఈ కార్యక్రమంలో పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీ చరణ్ సైతం ఈ కార్యక్రమంలో భాగంగా తాళికట్టు శుభవేళ అనే పాట పాడుతాడు పాట అనంతరం యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ… ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ మర్చిపోయిన స్టూడెంట్ లా ఉన్నారని అనగా వెంటనే జడ్జ్ అనంత శ్రీరామ్ ముందు సీజన్లో అయితే తనకు కావాల్సిన వాళ్ళు యాంకరింగ్ చేసే వాళ్ళు అని అంటారు.
అనంత శ్రీరామ్ ఇలా అనగానే ప్రదీప్ వెంటనే శ్రీముఖికి ఫోన్ చేసి ఇవ్వగా చరణ్ జలజల జలపాతం నువ్వు అనే పాట పాడుతారు.అవతల వైపు శ్రీముఖి నాకు పాడాలని ఉంది కానీ జలుబు చేసిందని చెప్పగా ఎలా ఉన్నారండి అని శ్రీముఖిని అడుగుతారు. ఇలా సడన్ గా రెస్పెక్ట్ ఇస్తున్నావేంటి మామయ్య గారు షూటింగుకు వచ్చారా.. అంటూ శ్రీముఖి మాట్లాడటంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ నవ్వుతారు. శ్రీముఖి ఫోన్ కాల్ లీక్ అవడంతో నిజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నారా లేకపోతే షోలో భాగంగానే ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…