Pragathi: ఆ హీరో రోజంతా తనతో గడుపమన్నాడు... షాకింగ్ కామెంట్స్ చేసిన నటి ప్రగతి!
Pragathi: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క రంగంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఇబ్బంది కాస్తా గ్లామర్ ఫీల్డ్ అయినా సినీ ఇండస్ట్రీలో మరికాస్త ఎక్కువగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలామంది నటీమణులు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని,ఇలాంటి ఇబ్బందులను తాము ఎదుర్కొన్నామని ఇప్పటికే ఎంతోమంది బహిరంగంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి నటి ప్రగతి కూడా ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కెరియర్ మొదట్లో తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్ హీరో కూడా రోజంతా తనతో గడిపితే తనకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారని వెల్లడించారు.
ఇలా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియజేశారు కాని అయితే ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఇలా తాను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో మంది ఫీమేల్ ఆర్టిస్టులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈమె ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
ఇండస్ట్రీలో ఈ విధంగా మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని అలాంటి అవకాశాలకు ఆశపడి వారికి లొంగితే మన జీవితమే నాశనం అవుతుందని ప్రతిభతోనే ముందుకు వెళ్లాలని ప్రగతి సూచించారు. ఇక ఈమె ఎన్నో సినిమాలలో అక్క, పిన్ని, తల్లి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక నటిగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం డాన్స్ వీడియోలు వర్కౌట్ లతో ప్రగతి ఆంటీ రచ్చ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…