Featured

Actor Naresh: ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటుంది.. కార్మికుల సమ్మె పై స్పందించిన నరేష్?

Actor Naresh: సినీ కార్మికుల తమ వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ కార్మికులు తమకు వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ పై అధిక ఒత్తిడి తీసుకువస్తూ నేడు సమ్మెబాట పట్టారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనాలతో తమతో పని చేయించుకుంటున్నారని అందుకే వేతనాలు పెంచాలని సూచించినప్పటికీ ఫిలిం ఫెడరేషన్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు.

Actor Naresh: ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటుంది.. కార్మికుల సమ్మె పై స్పందించిన నరేష్?

24 యూనియన్ల సభ్యులు ఈ విధంగా ఫిల్మ్ ఫెడరేషన్ పై ఆందోళనకు దిగడంతో సీనియర్ నటుడు నరేష్ ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో కార్మికులందరూ సమ్మె బాట పట్టడం సరైన నిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు.

నిన్నటి నుంచి ఎంతోమంది దర్శకనిర్మాతలు తనకి ఫోన్లు చేస్తున్నారని ఇలా కార్మికులందరూ సమ్మెబాట పట్టడంతో నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుందని, ఫైనాన్స్ వారికి వడ్డీలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళతారని నరేష్ వెల్లడించారు.అయితే గత మూడు సంవత్సరాలుగా కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు ఆగిపోతే ఎంతో మంది ఆర్టిస్టులు కడుపునిండా భోజనం చేయడానికి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు.వైద్య ఖర్చులకు సరిపడా డబ్బులు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన మరోసారి గుర్తు చేశారు.

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ ప్రాణం పోసుకుంటుంది..

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కరోనా నుంచి కోలుకొని ప్రాణం పోసుకుంటుంది. ఇలాంటి సమయంలో షూటింగ్లు బంద్ చేస్తే ప్రతి ఒక్కరికి నష్టమేనని తెలిపారు. ప్రస్తుతం మన అందరికీ బ్యాంకులు నిండక పోయినా మూడు పూటల కంచం నిండుతుందని ఇలాంటి పరిస్థితులలో సమ్మె చేయడం మంచిది కాదు అంటూ ఆయన పేర్కొన్నారు. వేతనాలు పెంచకపోతే షూటింగ్లు బంద్ చేయకుండా పెద్దలతో కలిసి పోరాటం చేయాలని ఆయన పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago