మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు భరించలేక కన్న కూతురితో పాటు ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో గురువారం తెల్లవారుజామున ఓ మహిళ కూతురిని నడుముకు కట్టేసి వాటర్ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన చోటుచేసుకుంది .
తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత(20)కు రెండేళ్ల క్రితం మేనబావ ఎత్తరి శ్రీశైలం(25)కు ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ప్రస్తుతం తొమ్మిది నెలల కుమార్తె ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అతనపు కట్నం కావాలని ప్రతీ రోజు అత్తామామలు వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయం తన భర్తకు చెప్పినా పట్టించుకోకపోవడతో పాటు తల్లికే అతడు సపోర్ట్ చేశాడు.
దీంతో ఈ కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు రావడంతో కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. తెలిసిన వాళ్ల దగ్గర వెతికారు. బంధువుల ఇళ్లకు ఫోన్ చేసి ఆచూకీ అడిగారు. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. చేసేది లేక వాళ్లు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వాళ్లకు జరిగిన విషయం చెప్పారు.
వారు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం ఆ ఊరి సమీపంలోనే వాటర్ ట్యాంక్‌లో తల్లీ కూతుళ్లు మృతదేహాలను ఆ గ్రామ ప్రజలు చూశారు. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…