పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలని చెబుతూ ఉంటారు. అలాగే పెళ్లి చేసే ముందు కలిసి జీవితాంతం బతికే ఆ వధూవరుల ఇష్టా, ఇష్టాలను అడిగి చేయాలని చెబుతుంటారు. అలా కాకుండా వధువు, వరుడిలో ఏ ఒక్కరికి అయినా ఆ పెళ్లి ఇష్టం లేకపోతే, వారు జీవితాంతం కష్టపడాల్సి ఉంటుంది.
ఇష్టంలేని పెళ్లి వల్ల భార్యభర్తల మధ్య కొట్లాటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్న చిన్న వాటికి పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకవేళ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న, ఆ తరువాత కొట్లాటలు, సమస్యలు వచ్చినప్పటికీ ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వాటిని అధిగమిస్తూ వెళ్లాలి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం తనకి ఇష్టంలేని పెళ్లి చేశారని ఏకంగా తన భార్యను స్నేహితులకు అమ్మేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒక వ్యక్తికి సంవత్సరం కిందట పెళ్లయింది. అయితే అతను కట్నంకోసం చేసుకున్నాడో, లేక తన తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడో తెలియదుకానీ, పెళ్లి చేసుకున్న అప్పటినుంచి తన భార్యను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. ఆమెను అందంగా లేవు, అసహ్యంగా ఉన్నావు అంటూ చిత్రహింసలకు గురి చేసే వాడు.ఆ కోపంతోనే ఏ భర్త చేయని ఒక దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యను తన స్నేహితులకు అమ్మేసి చేతులు దులుపుకున్నాడు.
ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో జరిగింది.కోటకు సమీపంలోని బుండి అనే ప్రాంతానికి చెందిన ఒక యువతిని విజయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన రాకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి తర్వాత రాకేష్ తన భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు.. భార్య అందంగా లేదని తిడుతూ చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమెపై ఉన్న కోపంతో ఆమెను తన స్నేహితులకు అమ్మేశాడు. వారు ఆమెను దెవ్లీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ ఇంట్లో ఉంచి, కొన్ని రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత వారి చెర నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…