బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ పెక్ట్ గా పిలవబడే అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ దంపతులు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.ఈ దంపతులు తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు ప్రకటించి, అనంతరం విడాకులు తీసుకున్నారు. తమ వైవాహిక జీవితంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఆనందాలు, హాయిగా గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వెల్లడిస్తూ అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు ఇకపై తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్నట్టు అభిమానులకు తెలిపిన విషయం తెలిసిందే.
ఇక అమీర్ ఖాన్,కిరణ్ రావ్ విడాకులు తీసుకోవడానికి కారణం దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అమీర్ ఖాన్ ఈమెతో ప్రేమలో పడటం వల్లే తన భార్య కిరణ్ రావ్ కు విడాకులు ఇచ్చినట్టు బాలీవుడ్ సినీ వర్గాల్లో కోడై కూసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది అని చెప్పవచ్చు.
ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ప్రేమ జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. బాలీవుడ్ అమీర్ ఖాన్ ఇటీవలే తన రెండో భార్య కిరణ్ రావ్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమీర్ ఖాన్ పెళ్ళికొడుకు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కి పెద్ద కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ గురించి మనందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఇద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దంగల్ సినిమా షూటింగ్ సమయంలో అమీర్ తో ఫాతిమా ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా అనంతరం ఈ జంట పెళ్లిపీటలు ఎక్కునున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…