వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రైతులను టార్గెట్ చేస్తూ ధాన్యం దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాల కోసం కొత్త తరహా నేరాలకు తెరతీసిన ఈ ముఠా బీటెక్ విద్యార్థులతో పాటు మరికొందరితో కలిసి పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది.
పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండకు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతీక్, అస్లాం, రాహుల్ ఖర్చులకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఈ దొంగతనాలకు ప్లాన్ చేశారు. రాత్రి వేళల్లో హైవేలు, గ్రామీణ రహదారులపై రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని గమనించి, సరైన సమయం చూసి బస్తాలు ఎత్తుకెళ్లేవారు.
ఈ నేరాల్లో సహకారం కోసం వారు మరికొంత మందిని కూడా రంగంలోకి దింపారు. నేపాల్‌కు చెందిన ముగ్గురు మైనర్లు, ఒక యువతి సహా మొత్తం నలుగురిని ఈ గ్యాంగ్‌లో చేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఖరీదైన అద్దె కార్లను ఉపయోగిస్తూ, సులభంగా గుర్తించకుండా దొంగతనాలు చేసినట్లు గుర్తించారు.
కేవలం 15 రోజుల వ్యవధిలోనే వరంగల్ ప్రాంతంలోని 15 మంది రైతుల వద్ద నుంచి సుమారు 242 ధాన్యం బస్తాలను ఈ ముఠా చోరీ చేసినట్లు వెల్లడైంది. ఈ ఘటనలతో గ్రామాల్లో రైతుల మధ్య అనుమానాలు, ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.
దొంగిలించిన ధాన్యాన్ని దూర ప్రాంత రైస్ మిల్లులకు తరలించి అమ్మి, వచ్చిన డబ్బును రాహుల్ ఇంట్లో దాచినట్లు దర్యాప్తులో తేలింది. తర్వాత ఆ మొత్తాన్ని పంచుకోవాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
పక్కా సమాచారం ఆధారంగా దాడులు చేసిన పోలీసులు మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3,05,200 నగదు, రెండు కార్లు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా 21 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…