Categories: FeaturedGeneral News

Top 10 Tourist Places in Hyderabad : హైదరాబాద్ లో చూడదగ్గ 10 బెస్ట్ ప్రదేశాలు ఇవే..!

హైదరాబాద్ నగరానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. నిజాం రాజుల కాలంలో ఈ ప్రాతం ఎంతో గొప్పగా వర్ధిల్లింది. సిటీ ఆప్ పెరల్ గా గుర్తింపు తెచ్చుకుంది. చారిత్రక, సాంస్కృతి కళాఖండంగా వర్ధిల్లుతుంది.

కాస్మోపాలిట్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ లో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. వాటిలో టాప్ 10 ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.చార్మినార్

హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్. పాత బస్తీలో ఉన్న ఈ చారిత్రక కట్టడాన్ని హైదరాబాద్ నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్ షా 1591లో కట్టించాడు. ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ఉన్న ఈ కట్టడాన్ని చూసేందుకు నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఇక్కడ ఎంతో మంది వీధి వ్యాపారులు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు.

2.గోల్కొండ కోట
హైదరాబాద్ లో మరో పర్యాటక ప్రాంతం గోల్కొండ కోట. 13వ శతాబ్దంలో ఈ కోటను కుతుబ్ షాహీలు నిర్మించారు. ఈ కోట నిర్మాణంలో అప్పట్లోనే అద్భుత మెలకువలు, టెక్నాలజీని పొందు పర్చారు. కోట కింద చప్పట్లు కొడితే.. కోట పైన దర్బారు హాల్లో వాటి శబ్దం వినిపిస్తుంది. ఇందులో రామదాసు బందీఖానాతో పాటు పలు అద్భుతమైన నిర్మాణాలు ఇందులో ఉన్నాయి.

3. రామోజీ ఫిల్మ్ సిటీ
2500 ఎకరాల్లో నిర్మితమైన రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సినిమాను నిర్మించేందుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయి. 50 సినిమా యూనిట్లు ఉన్నాయి. అత్యంత పెద్ద స్టూడియోలు సైతం ఇందులో ఉన్నాయి. అతి పెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్ బుక్ లోనూ స్థానం సంపాదించింది.

4. ముచ్చెర్ల ఆధ్యాత్మిక కేంద్రం
రంగారెడ్డి శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల స్థలంలో రామానుజా చార్యుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు 2014లోనే శంకుస్థాపన చేశారు చిన్నజీయర్‌ స్వామి. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. తామర పువ్వుపై కూర్చున్న రామానుజాచార్యుని విగ్రహం ఐదు లోహాలతో రూపొందించారు. లోపల 54 అంగుళాల ఎత్తులో 120 కిలోల బంగారంతో చేసిన మరో శ్రీరామానుజాచార్యుల విగ్రహం కొలువుదీరింది. రామానుచార్య విగ్రహం చుట్టూ నల్లరాతితో చెక్కబడిన 108 చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిని దివ్య దేశం అని పిలుస్తున్నారు.

5.హుస్సేన్ సాగర్
హైదరాబాద్ కు నడిబొడ్డున ఉంది ఈ సరస్సు. ఒకప్పుడు ఇందులో మంచినీళ్లు ఉండేవి. రాను రాను మురికి కూపంగా తయారైంది. ఇందులో ఉన్న బుద్ద విగ్రహం పర్యాటక ప్రదేశంగా వర్దిల్లుతుంది.

6.చౌమహల్లా ప్యాలెస్
18వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. 2010లో చారిత్రక నిర్మాణంగా యునెస్కో గుర్తింపు పొందింది. దీని చూసేందుకు కూడా జనాలు తరలి వస్తారు.

7.కుతుబ్ షాహి టూంబ్స్
గోల్కోండ కోటకు అత్యంత సమీపంలో ఇవి ఉంటాయి. సమాధులపై నిర్మించిన ఈ కట్టడాలు పర్షియన్ డిజైన్లలో కొలువు దీరాయి. వీటిని చూసేందుకు కూడా జనాలు వెళ్తుంటారు.

8.లుంబినీ పార్క్
1994లో హుడా అధికారులు దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో మ్యూజికల్ ఫౌంటేన్, లేజర్ షో జనాలను అలరిస్తాయి. హైదరాబాద్ చూసేందుకు వచ్చిన ప్రతివారు ఈ పార్క్ లోకి తప్పక వెళ్తారు.

9. బిర్లా ప్లానెటోరియం
హైదరాబాద్ ల మరో చూడదగ్గ ప్రదేశం బిర్లా ప్లానెటోరియం. దీన్ని జపాన్ టెక్నాలజీ సాయంతో నిర్మించారు. ఇందులో సైన్స్, ఆర్కియాలజీకి సంబంధించిన పలు విషయాలను చూసే అవకాశం ఉంది. స్కైషో ద్వారా గ్రహాలు, నక్షత్రాలన చూడవచ్చు.

10. సాలార్జంగ్ మ్యూజియం
దేశంలోనే ప్రఖ్యాత మ్యూజియాల్లో ఇది ఒకటి. ఇందులో 43 వేల వస్తువులు, 47 వేల పుస్తకాలు సహా పలు చారిత్రక అంశాలు ఇందులో ఉన్నాయి. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర ప్రధాన మంత్రిగా ఉన్న సాలార్జంగ్ విదేశాల నుంచి సేకరించిన వస్తువులతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago