మెగాస్టార్ చిరంజీవి వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే అరడజన్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొరటాల శివతో ’ఆచార్య‘ సినిమా పూర్తయింది. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్‘, మోహన్ రాజా దర్శకత్వంలో ’గాడ్ ఫాదర్‘ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
మరో వైపు వెంకీ కుడుముల డైరెక్షన్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్. అయితే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో చిరంజీవి గుండు గెటప్ లో కనిపించారు. ఎందుకంటే మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’భోళా శంకర్‘ మూవీ కోసం ఇలా కనిపించారు మెగాస్టార్. ఈ లుక్ పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ’వేధాళం‘ సినిమాకు రిమేక్ భోళా శంకర్ తెరకెక్కుతోంది.
ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. దీంట్లో ఆలుమ డోలుమ క్యారెక్టర్ కోసం అజిత్ గుండుతో కనిపిస్తారు. అయితే దీన్ని ట్రై చేద్దాం అనుకున్నారు చిరంజీవి. అయితే గుండు గెటప్ చిరంజీవకి నప్పలేదని…వేరే విధంగా ప్రోసీడ్ అవుదాం అనుకున్నాడు మెహర్ రమేష్. చిరంజీవి గడ్డంతో బాగానే ఉంటాడని.. ఇదే లుక్ లో భోళాశంకర్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను నడిపిద్దాం అనుకుంటున్నాడట డైరెక్టర్.
మెహర్ రమేష్ ఆలోచన చిరంజీవికి కూడా నచ్చడంతో ప్రొసీడ్ అవుతున్నారట. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. చిరంజీవికి చెల్లిలి క్యారెక్టర్ లో కీర్తి సురేష్ నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ‘క్రియేటివ్ కమర్షియల్స్’ అధినేత కె.ఎస్.రామారావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…