Telugu Indian Idol: ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో టాప్ సింగర్స్ వీళ్లే!
Telugu Indian Idol: ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా వివిధ రకాల కార్యక్రమాలకు ఎంతో ఆదరణ దక్కిందని చెప్పాలి.ఈ క్రమంలోనే బుల్లితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అయినా ఆహా గురించి అందరికీ తెలిసిందే.
ఆహా వేదికగా ఇప్పటికే ఎన్నో కుకింగ్ షోస్, టాప్ షోస్, అలాగే వెబ్ సిరీస్ లో సినిమాలు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. తాజాగా ఆహా ద్వారా ఇండియన్ ఐడల్ సింగింగ్ షో కూడా ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో నైపుణ్యం గల సింగర్లు తమ అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి సింగ్ శ్రీరామచంద్ర వ్యవహరించగా ఎస్.ఎస్.తమన్, నిత్య మీనన్, కార్తీక్ ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఆహా ఓటీటీలో ఈ షో రికార్డు స్థాయిలో సొంతం చేసుకుంటుంది ఇక ఈ కార్యక్రమం నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా థియేటర్ రౌండ్ ప్రసారం కాగా జడ్జీలు ప్రతిభ ఉన్న 12 మంది సింగర్ ల ను తరువాతి రౌండ్ కు ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలోని చివరి ఎపిసోడ్ లో భాగంగా పలువురు గోల్డెన్ మైక్ అందుకొని టాప్ సింగర్స్ నిలిచారు.గత శుక్రవారం ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో సింగర్ వాగ్దేవి, శ్రీనివాస గోల్డెన్ మైక్ అందుకోగా శనివారం ఎపిసోడ్ లక్ష్మీ శ్రావణి, ప్రణతి గోల్డెన్ మైక్ అందుకొని టాప్ పొజిషన్ లో ఉన్నారు.ఇక గతవారం మిగిలిన కంటెస్టెంట్ లు కూడా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…