Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!
Singer Chinmayi: గాయని చిన్మయి గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆమె సింగింగ్ తో పాటు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేస్తుంది. అయితే ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటుంన్నారు. మొన్న హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను ఈమె తప్పుపడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఆమె స్త్రీల సమస్యలపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతుంది. అలాగే సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. వారు ఎదుర్కొంటున్న బాధలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ సమాజంలో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో చిన్మయితో పలువురు మహిళలు తమకు ఎదురైన సమస్యలను చెప్పగా.. వారికి ఆమె సూచనలు, సలహాలను ఇస్తూ వస్తోంది. దీనిలో కూడా ఎలాంటి మానసిక సంఘర్షణలకు చోటు లేకుండా చిన్మయి సలహాలు ఇస్తుంటారు.
తాజాగా సింగర్ చిన్మయి తన ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో, హీరోయిన్‌ని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినందుకు బాధితురాలికి పలువురు హీరోయిన్లు , సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు.
వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్ కూడా ఒకరు. ఈ ఘటన తర్వాత పార్వతి పలు మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేసింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం వల్ల తనకు సినిమా అవకాశాలు పోయాయని.. అంతకముందు తాను ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించానని.. అవి అన్నీ హిట్ అయ్యాయని.. అయినా సినిమా అవకాశాలు రాలేదని ఆమె చెప్పారు. ఆ పోరాటం వల్లే తనకు ఇలా జరిగిదంని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ.. అవకాశాలు రాలేదని.. అలాగే ఫైటింగ్ కూడా చేస్తూ.. హీరోయిన్ కు సపోర్ట్ చేసినందుకు తనను బెదిరించారని చెప్పింది. ప్రస్తుతం తాను రెండు సినిమాల్లోనే నటిస్తున్నానని చెప్పింది పార్వతి. ఈ విషయంపై గాయని చిన్మయి స్పందించింది. ‘‘పార్వతి లాంటి మంచి నటి నిజం చెప్పినందుకు సినిమా అవకాశాలు కోల్పోయింది. లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి పక్షాన మాట్లాడినందుకే అలాంటి నటికి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నిజం. చాలామంది మహిళలు మౌనంగా ఉంటారు. ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది’’ అని చిన్మయి ట్వీట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, నటుడు దిలీప్ కుమార్ అరెస్టయి, బెయిల్‌పై తిరిగి వచ్చారు. జనవరి 18 వరకు అరెస్టు చేయరాదని కేరళ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…