రాను రాను మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళల రక్షణ కొరకు ఎన్నో చట్టాలు తెచ్చినా.. పిరిస్థితుల్లో మార్పు రాలేదు. మహిళ బయట అడుగుపెట్టింది మొదలు.. ఇంటికి తిరిగి వచ్చేదాక రక్షణ లేకుండా పోతోంది. దీంతో తల్లిదండ్రలు ఆందోళనకు గురవుతున్నారు.
తాజాగా జరిగిన ఘటనలో ఓ వివాహిత అర్ధరాత్రి కాలకృత్యాల కోసం నది ఒడ్డుకు వెళ్లింది. సమయం కోసం వేచి చూసిన నలుగురు దుర్మార్గులు.. ఆ వివాహితను టవల్‌తో కట్టేసి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఒడిశాలోని పూరి జిల్లా నిమపారాలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ కాలకృత్యాలకు ఆమె ఇంటి సమీపంలోని కాలువ ఒడ్డుకు వెళ్లింది. ఆమె ఒటరిగా వెళ్లింది గమనించిన కొందరు ఆమెను ఫాలో అయ్యారు. ఒంటరిగా ఉన్నది చూసి.. ఆమెపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. టవల్ తో కట్టేసి.. అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు.. ఇలా ఘోరానికి పాల్పడ్డారు.
ఎంతకూ ఆమె ఇంటికి రాకపోవడంతో.. కుటుంబీకులు వెళ్లి చూడగా.. షాక్ అయ్యారు. సంఘటనా ప్రదేశంలో ఆమె తీవ్ర రక్తస్రావంతో పడి ఉండటం గమనించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలితో పాటు… కుటుంబసభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…