General News

టెన్త్‌లో టాప్ మార్కులు.. ప్రేమోన్మాది వేధింపులకు బలైన టెన్త్ విద్యార్థిని.. ఆత్మహత్యతో విషాదకర ముగింపు

రాయచోటి: ప్రేమ పేరుతో జరుగుతున్న వేధింపులు భరించలేక సృజన అనే 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పట్టణ పరిధిలో గల మిట్టవాండ్లపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Top marks in 10th.. 10th student victim of lover’s harassment

సృజన తండ్రి చంద్రగిరి ఉత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన మిట్టవాండ్లపల్లిలో బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె సృజన ఇటీవల పదవ తరగతిలో 554 మార్కులు సాధించింది.

కుమార్తె ప్రతిభకు మురిసిపోయిన ఉత్తయ్య, ఆమెను పట్టణంలోని రాజు ఐఐటి కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివించాలని అనుకున్నారు. అడ్మిషన్ కూడా తీసుకున్నారు. అయితే, మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సృజన ఏడుస్తూ ఇంటికి రావడంతో ఉత్తయ్య ఆందోళన చెందారు. ఏం జరిగిందని అడగగా.. తారకరత్న అనే వ్యక్తి తనను చంపేస్తాడని భయంగా ఉందని చెప్పింది.

కూతురి మాటలు విని షాక్ తిన్న ఉత్తయ్య, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడిగాడు. అప్పుడు సృజన చెప్పిన విషయాలు విని ఆయన గుండె పగిలిపోయింది. నెల రోజులుగా తారకరత్న ప్రేమ పేరుతో తనను వెంటపడుతున్నాడని, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని సృజన తెలిపింది. ఈ విషయం ఇంట్లో చెబితే గొడవ అవుతుందని భయపడి ఎవరికీ చెప్పలేదని, తనను వేధించవద్దని తారకరత్నకు చెప్పినా వినలేదని వాపోయింది. అంతేకాదు, తన తండ్రిని కూడా చంపేస్తానని తారకరత్న బెదిరించాడని సృజన చెప్పడంతో ఉత్తయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

సృజన తల్లిదండ్రులు ఈ విషయాన్ని బయటకు చెబితే చదువుకునే పాపకు ఇబ్బంది అవుతుందని భావించి, నేరుగా తారకరత్న తల్లిదండ్రులకు చెప్పి సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నారు. కానీ, విధి మరోలా తలచింది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పిల్లలంతా ఆడుకుంటుండగా సృజన హడావిడిగా ఇంట్లోకి వచ్చి తారకరత్న తన ఫొటోలు బయటపెడతాడని భయమేస్తోందని చెప్పి హాల్‌ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుందని ఉత్తయ్య కన్నీటి పర్యంతమయ్యాడు.

కుటుంబ సభ్యులంతా కలిసి తలుపు తీయమని ఎంత చెప్పినా సృజన వినలేదు. దీంతో వారు తలుపు పగలగొట్టి చూడగా బెడ్‌రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకు దించి ఆటోలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సృజన మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు.

ప్రేమ పేరుతో వేధించి, లొంగలేదనే కారణంతో ఫొటోలు బయటపెడతానని బెదిరించి తన కూతురు చావుకు కారణమైన తారకరత్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తయ్య పోలీసులను వేడుకున్నాడు. సృజన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సిఐ బి.వి.చలపతి తెలిపారు.

ఈ సంఘటన రాయచోటిలో తీవ్ర విషాదాన్ని నింపింది. సృజన కుటుంబానికి న్యాయం జరగాలని స్థానికులు కోరుకుంటున్నారు. పోలీసులు ఈ కేసును ఎంతవరకు దర్యాప్తు చేస్తారో వేచి చూడాలి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago