జూబ్లిహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మూహరించారు. కోకాపేటలోని ప్రభుత్వం వేలం వేసిన భూములను సందర్శించాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో కోకాపేట భూముల సందర్శనకు కాంగ్రెస్ నేతలను వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు.
ఈ నేపధ్యంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు రేవంత్‌రెడ్డిని బయటకు వెళ్ళనివ్వకుండా గృహనిర్బంధం చేశారు. మరోవైపు ఉదయం 11 గంటలకు దామోదర రాజనర్సింహతో సహా పలువురు నేతలు కోకాపేట భూముల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారిని కూడా పోలీసుల అడ్డుకునే అవకాశముంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…