టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ మధ్య ఈ హీరో తాను గతంలో పనిచేసిన దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు.. గతంలో కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ చేశాక తక్కువ విరామంలో మళ్లీ అదే దర్శకుడితో ‘భరత్ అనే నేను’ చేశాడు. ‘మహర్షి’ తీసిన వంశీ పైడిపల్లితో కూడా వెంటనే ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు కానీ.. మహేష్ మెచ్చే కథను వంశీ సిద్ధం చేయలేకపోవడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది.
ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్‌తోనూ మరో సినిమాకు మహేష్ కమిట్మెంట్ ఇచ్చాడు. నిజానికి ‘సర్కారు వారి పాట’ తర్వాత అనిల్‌తోనే మహేష్ సినిమా చేయాల్సింది. దీనికి అనిల్ కథ కూడా రెడీ చేసేశాడట. ఐతే ఈలోపు అనుకోకుండా త్రివిక్రమ్‌తో సినిమాను ముందుకు తెచ్చాడు మహేష్.’ఎఫ్-3′ తర్వాత తాను మహేష్ సినిమాను మొదలుపెట్టాల్సి ఉండగా.. అనుకోకుండా త్రివిక్రమ్ సినిమా రావడంతో అది ఆలస్యం అవుతోందని ఓపెన్‌గానే చెప్పేశాడు అనిల్.
త్రివిక్రమ్‌తో మహేష్ సినిమా అవ్వగానే ఆయనతో తన సినిమా మొదలవుతుందని అనిల్ క్లారిటీ ఇచ్చాడు. బహుశా అనిల్ కెరీర్ ఆరంభం నుంచి అతడితో జర్నీ చేస్తున్న దిల్ రాజే ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుతం చేస్తున్న ‘ఎఫ్-3’ గురించి అనిల్ చెబుతూ.. ఏప్రిల్ 15న మైసూర్‌లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాల్సిందని.. కానీ 14న తనకు కరోనా రావడంతో ఆ ప్లాన్ మొత్తం మారిపోయిందని చెప్పాడు.
ఇప్పటికి 50 శాతానికి పైగానే సినిమా పూర్తయిందని.. మైసూర్ షెడ్యూల్ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే 80 శాతం షూటింగ్ అయిపోయేదని అన్నాడు. తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పుడు కొత్తగా షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నట్లు అనిల్ వెల్లడించాడు.తన భార్య, పిల్లలకు కూడా కరోనా సోకిందని.. దేవుడి దయ వల్ల అందరూ కోలుకున్నారని అనిల్ వెల్లడించాడు. ‘ఎఫ్-3’ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చెన్నైలోని ఒక హోటల్‌కు వెళ్లానని.. బహుశా అక్కడే తనకు కరోనా సోకి ఉండొచ్చని భావిస్తున్నట్లు అనిల్ తెలిపాడు..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…