టాలీవుడ్లో ‘పెళ్లి చూపులు’ అనే సినిమా ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి..విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు.. ఇక సినిమాలో హీరో ఫ్రెండుగా అతను చేసిన కామెడీకి ప్రేక్షకులు భలేగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సినిమా చివర్లో అనీష్ కురువిల్లా వచ్చి నువ్వేం చేస్తుంటావని అడిగితే.. బుక్కు రాస్తున్నా అనడం.. ఏం బుక్ అని అడిగితే..
‘నా సావు నేను చస్తా. నీకెందుకు’ అని బదులిచ్చే డైలాగ్ ఎంతగా పేలిందో తెలిసిందే. ఆ ఒక్క డైలాగ్‌తో అతను ఎనలేని పేరు సంపాదించి బిజీ కమెడియన్ అయిపోయాడు.ఈ డైలాగ్‌ను ఎంతోమంది ఎన్నో రకాలుగా వాడుకున్నారు. మీమ్స్‌కైతే లెక్కే లేదు. ఇప్పుడు కరోనా మీద అవగాహన కల్పించడానికి ప్రియదర్శి తన ఫేమస్ డైలాగ్‌నే ఉపయోగించుకున్నాడు.ప్రస్తుతం కరోనా ఏ స్థాయిలో కల్లోలం రేపుతోందో తెలిసిందే.
ఇప్పటికీ మాస్కు ఆవశ్యకతను గుర్తించని జనాలు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిలో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు ప్రియదర్శి. మాస్కు లేని ఫొటో ఒకటి పెట్టి.. దానికి ‘నా సావు నేను చస్తా. నీకెందుకు’ అని క్యాప్షన్ పెట్టాడు.మాస్కు పెట్టుకున్న మరో ఫొటోను షేర్ చేసి.. దానికి ‘నా బతుకు నేను బతుకుతా. నా అవసరం’ అని క్యాప్షన్ జోడించాడు. మాస్కు పెట్టుకుంటేనే బతుకుతారని.. అది తీసేస్తే ప్రమాదం తప్పదని చాలా చక్కగా, సింపుల్‌గా చెప్పేశాడు ప్రియదర్శి.
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రియదర్శి కెరీర్ విషయానికి వస్తే.. అది మంచి ఊపులోనే ఉంది. అతను ప్రధాన పాత్రలో నటించిన ‘మెయిల్’ ఓటీటీలో, ముగ్గురు హీరోల్లో ఒకడిగా నటించిన ‘జాతిరత్నాలు’ థియేటర్లలో అద్భుత స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే..ఇక ఈ సినిమాకి త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతోందట..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…