మాస్ లుక్ తో అదరగొడుతున్న టక్ జగదీశ్ ఫస్ట్..!!

నాచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “టక్ జగదీశ్” ఫస్ట్ లుక్ ను క్రిస్మస్ సందర్బంగా విడుదల చేసారు చిత్రబృందం. ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి ఈ సినిమా ఆద్యంతం హీరో నాని టక్ వేసుకునే ఉంటాడని, అందువల్లే ఈ సినిమాకు “టక్ జగదీశ్” అనే టైటిల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నాని ఎవరూ ఊహించని విధంగా మాస్ లుక్ లో కనిపిస్తూ భోజనం ముందు కూర్చొని వెనుక నుంచి కత్తి తీస్తూ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నాని పాత్ర పేరు “జగదీశ్ నాయుడు” ఆని తెలుస్తోంది.

ఇటీవలే నాని నటించిన “వి” విడుదలై చిత్రం యావరేజ్ టాక్ రావడంతో నాని “టక్ జగదీశ్” పై పూర్తీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. నాచురల్ స్టార్ నాని, పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తీరకేక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవల పునః ప్రారంభమైంది.