రాజస్థాన్ ఎలిజబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (ఆర్ఈఈటీ) ఫర్ టీచర్ పరీక్షలో అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పరీక్ష రాసే వారిలో కొంత మంది చెప్పులో బ్లూటూత్ పెట్టుకుని రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జాగామినేషన్ కు హాజరైన ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా వీరిలో ఒకర్ని అజ్మీర్ లో అదుపులోకి తీసుకున్నారు.
తీగ లాగితే డొంక కదిలినట్లు.. అతడిని విచారించగా మరికొంత మంది భయటపడ్డారు. దానిలో పోలీస్ కానిస్టేబుల్ దేవేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుల్ యధువీర్ సింగ్ కూడా ఉన్నారు. కానీ వాళ్లు ఎగ్జామ్ రాయడానికి కాదు.. వారి భార్యలకు హెల్ఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో వాళ్లిద్దరిని సస్పెండ్ చేశారు. వారిద్దరిని విచారించగా.. ఆ చెప్పులను విద్యార్థులు రూ.6 లక్షల చొప్పున తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ చీటింగ్ చెప్పులను తెలివిగా తయారు చేస్తున్నారని… ఇలాంటి చెప్పులను హార్డ్ వేర్ తో కలిపి ఒక్కో జతను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ నగరంలో ఇద్దరు పోలీసులు చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్ష జరగడానికి ముందే వాళ్ల దగ్గరకు ప్రశ్నాపత్రం వచ్చింది. దీంతో వాళ్లకు జవాబులు చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో వాళ్లను అదుపులోకి తీసుకొని.. వారిని పోలీసులు మొబైల్ ఫోన్లలో రీట్ పేపర్లు ఉన్నట్లు తెలిపారు. అయితే వారికి ముందుగానే ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా.. ఈ వ్యవహారంలో మొత్తం 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…