Categories: FeaturedGeneral News

మేకలు కాసే 16 ఏళ్ల బాలికపై 25 రోజులుగా అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..

మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని చురూ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చురూ జిల్లలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలిక మేకలు కాస్తూ ఉంది.

ఆమె 25 రోజుల క్రితం ఓ కొండపైకి వెళ్లింది. అక్కడ నుంచి మేసుకుంటూ మేకలు.. కింద వరకు వస్తుండగా.. వాటిని అనుసరిస్తూ ఆ బాలిక కూడా వచ్చింది. అటు నుంచి ఓ కామాంధుడు జీపులో వచ్చి బలవంతంగా ఆమేను జీపులోకి ఎక్కించాడు. అక్కడ నుంచి ఆమెను జిల్లాలోని మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు.

ఆమె కాపాడండి అంటూ అరుస్తుండగా.. నోటికి ప్లాస్టర్ వేసి మాట రాకుండా మూసి.. వేరే చోటుకు ఆ జీపును తీసుకెళ్లాడు. ఇలా ఆ ప్రదేశంలో ఆమెను 20 నుంచి 25 రోజులుగా రోజూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె అక్కడ నుంచి అతడు బయటకు వెళ్లింది చూసి.. ఎలాగోలా బయటపడి తన ఇంటికి వెళ్లి.. అక్కడ తన కుటుంబసభ్యులతో పాటు పోలీస్ స్టేషన్ కు జరిగిన విషయం చెప్పి వారిపై ఫిర్యాదు చేసింది.

ఆ రూంలో అతడితో పాటు మరికొంత మంది తనకు తేనీటిలో మత్తుపదరర్ధాన్ని కలిపి ఇచ్చారని చెప్పింది. ఇలా దాదాపు 25 రోజుల దాకా తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొంది. దీనిపై పోలీసులు ఆ నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు . పరారీ లో ఉన్న ఆ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago