Uma Gavini : సహాయం చేసిన వారిని కూడా మర్చిపోయే ఈ రోజుల్లో చదువుకున్న కాలేజ్ అభివృద్ధి కోసం తన అస్థి మొత్తము ఇచ్చే మనసున్న మనుషులు కూడా ఉన్నారా అనే అనుమానం కలుగతుంది. కానీ తాను వైద్య విద్య నేర్చుకున్న కాలేజ్ అభివృద్ధి కోసం తన ఆస్తి తన వ్యక్తిగత బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం ఇచ్చేసారు అమెరికాకు చెందిన వైద్యురాలు ఉమా గవిని. ఈ వార్తతో సోషల్ మీడియాలో ఆమె ఇప్పుడు వైరల్ అయ్యారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు మహిళ ఉమా గవిని తన ఆస్తి మొత్తం గుంటూరు వైద్యకళాశాల అభివృద్ధికి దానం చేసారు.
తనకంటూ ఏమి ఉంచుకోకుండా మొత్తం దానం…
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల లో 1960 లో మెడిసిన్ చేసిన ఉమ గవిని గారి సొంతూరు తెనాలి. ఆమె తండ్రి ప్రాఖ్యాత రచయిత గవిని వెంకటకృష్ణ గారు. ఇక ఉమ గారి భర్త కూడా మత్తుమందు ఇచ్చే వైద్యలు. ఇద్దరూ మెడిసిన్ అయ్యాక అమెరికా లోనే స్థిరపడి అక్కడే వైద్య వృత్తి చేపట్టారు. మూడేళ్ళ క్రితం ఉమా గారి భర్త మరణించారు.
ఇక వారికి పిల్లలు కూడా లేరు. గత నెలలో అమెరికా లోని డల్లాస్ నగరంలో గుంటూరు ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో పాల్గొన్న ఉమ గారు అక్కడ ఆమె నిర్ణయాన్ని ప్రకటించారు. ఆమె ఆస్తి దాదాపు 20 కోట్లు అలాగే తన బ్యాంకు బ్యాలన్స్ మొత్తం గుంటూరు ప్రభుత్వ కళాశాలలో కొత్తగా నిర్మిస్తున్న మెటర్నిటి వార్డు బిల్డింగ్ నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నానట్లు ప్రకటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…