Featured

Un Stoppable season 2 : 1995 సంక్షోభం గురించి నోరు విప్పిన చంద్రబాబు… కాళ్ళు పట్టుకున్నా పెద్దాయన విన్నాడా అంటూ…!

Un Stoppable season 2 : అన్ స్టాపబుల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ ఒక్క షోతో ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేటింగ్స్ లోనూ రికార్డులు సృష్టించింది అన్ స్టాపబుల్. సీజన్ వన్ ఆ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక సెకండ్ సీజన్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తున్నాడు. ఇక అన్ స్టాపబుల్ సీజన్ రెండు మొదటి ఎపిసోడ్ త్వరలో రాబోతోంది, ఇక దీనికి సంబంధించిన ప్రోమో కుడా విడుదల చేసారు. మొదటి ఎపిసోడ్ ఏకంగా తెలుగు దేశం అధినేత స్వయానా బాలయ్య కు బావ అయిన నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ లను పిలిచి బాలయ్య సందడి చేసారు.

1995 సంక్షోభం గురించి నోరు విప్పిన చంద్రబాబు…

చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్, తెలుగు రాష్ట రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. కానీ ఆయన రాజకీయ జీవితంలో 1995 లో ఎన్టీఆర్ గారిని తొలగించి చంద్రబాబు నాయుడు సీఎం అవడం ఎన్టీఆర్ కుటుంబమే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడటం, ఆనాటి పరిస్థితులను ప్రత్యర్థులు ఆయనను విమర్శించడానికి వెన్నుపోటు అనే ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఇక ఆయన రాజకీయ జీవితానికి అది ఒక మచ్చలాగా ఆయన ప్రత్యర్థులకు ఆయుధం లాగా నేటికీ ఉంది.

ఇక ఈ విషయం గురించి అన్ స్టాపబుల్ షోలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్య పరిచింది. బాలకృష్ణ అడగటం చంద్రబాబు గారు ఆ రోజు పెద్ధాయన ను కాళ్ళు పట్టుకుని బతిమాలాను అంటూ చెప్పడం ప్రోమోలో చూపిస్తారు. ఇక బాలకృష్ణ కూడా ఆ రోజు జరిగింది ఇంకా నాకు గుర్తుంది అంటూ మాట్లాడటం ఒక్కసారిగా షో మొత్తం సీరియస్ అయిపోయింది. ఇన్నేళ్లుగా చంద్రబాబు మీద ఉన్న ఆ నిందపై క్లారిటీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇస్తారేమో చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago