Featured

Un stoppable season 2 : తండ్రీకొడుకులు నా సంసారంలో నిప్పులు పొసేలా ఉన్నారంటూ బాలయ్య… నీకంటే రొమాంటిక్ పనులు చేసానన్న చంద్రబాబు… సరదా ముచ్చట్లతో అన్ స్టోపబుల్..!

Un stoppable season 2 : బాలయ్య బాబు అనగానే మాస్ కా బాప్ అనేలా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్. ఒకవైపు నందమూరి లెగసీ కాపాడుతూ మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని ఇటు హిందూపురం ఎమ్మెల్యే గా రాజకీయాలలో కంటిన్యూ అవుతూ మరో వైపు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, ఇంకో వైపు ఎనర్జిటిక్ గా సినిమాలను చేస్తూ మరో వైపు ఆహా ఒరిజినల్స్ లో అన్ స్టోపబుల్ షో చేస్తూ రచ్చ చేస్తున్నాడు బాలయ్య. సీజన్ వన్ మంచి హిట్ తో ఊపు మీద ఉన్న బాలయ్య సీజన్ 2 అంతే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక మొదటి గెస్ట్ గా స్వయానా యన బావగారు నారా చంద్రబాబు నాయుడు గారిని పిలిచి సందడి చేసారు. ఈ ఎపిసోడ్ కి సంబంధిచిన ప్రోమో నెట్టింట్లో సందడి చేస్తోంది.

నీకంటే రొమాంటిక్… బెస్ట్ ఫ్రెండ్ అతనే…

ఇక బాలకృష్ణ ఎపుడూ రాజకీయాలతో సీరియస్ గా ఉండే చంద్రబాబు నాయుడు గారిని చిలిపి ప్రశ్నలు వేసి సందడి చేసారు. ఇక చంద్రబాబు కూడా నువ్వు సినిమాల్లో రొమాంటిక్ ఏమో నేను కాలేజీ లో చదివేటప్పుడు చాలా చిలిపి పనులను చేసాను అంటూ చెప్పారు. ఇక బాలయ్య చెల్లి భువనేశ్వరి కి బావతో ఫోన్ లో ఐ లవ్ యు కూడా చెప్పించారు. ఇక నా చెల్లి కోసం ఒకసారైనా వంట చేశారా అని అడిగితే నాకోసం చేసుకోవడమే రాదు ఇక నీ చెల్లి కోసం ఎపుడు చేసేది అంటూ చంద్రబాబు చెప్పి నవ్వించారు. ఇక తన జీవితంలో ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే రాజశేఖర్ రెడ్డి అంటూ చంద్రబాబు చెప్పడం కొంచెం ఎమోషనల్ అవడం ప్రోమోలో చూపించారు.

ఇక మధ్యలో నారా లోకేష్ రావడం కాసేపు హోస్టింగ్ నేను చేస్తాను మిమ్మల్ని ప్రశ్నలు అడిగితాను అని బాలకృష్ణ ను ప్రశ్నలు వేశారు. ఇక బాలయ్య తండ్రీకొడుకులు కలిసి నా సంసారం లో నిప్పులు పోస్తున్నారు అంటూ నవ్వించారు. ఇక 1995 సంఘటన, అలాగే లోకేష్ మంగళగిరి లో ఓడిపోవడం వంటి విషయాలను కూడా ప్రస్థావించి ప్రమోను మరింత ఆసక్తికరంగా మార్చారు. మొత్తానికి అన్ స్టోపాబుల్ సీజన్ 2 ప్రోమో అదిరింది అనే చెప్పాలి, ఇక ఫుల్ ఎపిసోడ్ కోసం బాగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago