యువతులైనా, యువకులైనా వాళ్ల జీవితంలో పెళ్లి అనేది ఒక కళ. మూడు పదుల వయస్సు దాటక ముందే వైవాహిక బంధంలో అడుగుపెట్టి కలకాలం సంతోషంగా గడపాలని చాలామంది ఆశిస్తారు. నచ్చిన కలల రాకుమారుడు/రాకుమారి కోసం వెతుక్కుంటూ ఉంటారు. నచ్చిన వాళ్లు దొరికితే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అలా ఒక యువకుడు కూడా నచ్చిన అమ్మాయితో డేటింగ్ చేయాలని మొదట ఆ అమ్మాయిని ఇష్టపడాలని అనుకున్నాడు.
తనకు కాబోయే కలల రాకుమారి కోసం మ్యాట్రిమొనీ వెబ్ సైట్లలో, డేటింగ్ సైట్లలో వివరాలను అందుబాటులో ఉంచాడు. అయితే అతను ఎన్ని వెబ్ సైట్లలో వివరాలను నమోదు చేసినా ఒక్కరి నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు. దీంతో సదరు యువకుడు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. నచ్చిన అమ్మాయి లేని జీవితం వృథా అని… తాను ఎందుకు ఒక్క అమ్మాయికి కూడా నచ్చడం లేదని తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
దీంతో ఆ వ్యక్తి ఫేస్ బుక్ లో ఒక ఆసక్తికరమైన పోస్టును పెట్టి అందరి దృష్టిలో పడ్డాడు. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఆ వ్యక్తి పేరు అలాన్ క్లాయిటన్. ప్రస్తుతం మూడు పదుల వయస్సులో ఉన్న అలాన్ చిన్నప్పటి నుంచి సిగ్గరి. ఎవరితో అంత సులువుగా కలిసే వాడు కాదు. తాను ఒంటరిగా ఉంటున్నానని తనకు ఇష్టపడే ఒక అమ్మాయి కావాలని ఆవేదనను వ్యక్తం చేశాడు.
సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఈ పోస్టుకు నెట్టింట ఒక రేంజులో స్పందన వచ్చింది. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న అలన్ కు ఒక తోడు కావాలని అనిపిస్తోంది. దీంతో అతడు ఒక మంచి అమ్మాయి కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నాడు. త్వరలోనే అలాన్ కు మంచి అమ్మాయి దొరుకుతుందో లేదో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…