Upasana: మెగా కోడలు ఉపాసన మరి కొద్ది రోజులలో అమ్మ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసనల వివాహం జరిగిన పది సంవత్సరాలకు ఈమె గర్భం దాల్చడం అందరిని ఎంతో సంతోషానికి గురిచేస్తుంది ఇలా గర్భంతో ఉన్నటువంటి ఉపాసన మరి కొద్ది రోజులలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈమెకు సంబంధించిన విషయం తెలిసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఒక ఊయలను కానుకగా పంపించారు. అయితే ఈ ఊయలను కానుకగా పంపించిన వారి గురించి ఈ ఊయల ప్రత్యేకత గురించి ఉపాసన తెలియజేశారు. ఈ ఊయలను ఉపాసన బిడ్డ కోసం ప్రజ్వాలా ఫౌండేషన్ ప్రత్యేకంగా తయారు చేయించి పంపించారని తెలిపారు. ఈ ఫౌండేషన్ సెక్స్ ట్రాఫికింగ్ లోచిక్కుకున్న మహిళలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఉపాధిని కల్పిస్తుంది.
ఈ క్రమంలోనే అక్కడ మహిళలు తయారు చేసినటువంటి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ కానుకగా అందజేసినట్లు ఉపాసన తెలియజేశారు అయితే ఈ ఊయల తనకు ఎంతో ప్రత్యేకమైన తన తెలియజేశారు. అక్కడ మహిళలు వారిలోని ధైర్యం బలం ఆశ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ ఊయల తన బిడ్డకు గుర్తుండిపోతుందని తెలియజేశారు. తనకు పుట్టబోయే బిడ్డ చిన్నప్పటి నుంచి ఇలాంటి విషయాలకు బహిర్గతం కావాలని ఈమె ఆకాంక్షించారు.
త్వరలోనే మేము ముగ్గురం కాబోతున్నామంటూ ఉపాసన సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఇలా తన బిడ్డ కోసం ప్రత్యేకంగా ఊయల పంపించినందుకు ఈమె ఫౌండేషన్ వ్యవస్థాపకురాలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఊయల తయారు చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.youtube.com/watch?v=OuuRjEFsyFA
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…