Movie News

Upasana: పిల్లల విషయంలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు… ఆర్థిక భద్రత వచ్చాకే పిల్లలను ప్లాన్ చేశాం: ఉపాసన

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ప్రస్తుతం 6 నెలల గర్భంతో ఉందని మరి కొద్ది రోజులలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ శుభవార్త కోసం మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఉపాసన రాంచరణ్ వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతుంది ఇలా పదేళ్లుగా వీరిద్దరూ పిల్లలను ప్లాన్ చేయకపోవడంతో తరచూ ఉపాసనకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురవుతూ వచ్చాయి. అయితే ఆమె సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతా అంటూ ఈ ప్రశ్నను దాట వేసేవారు.అయితే గత ఏడాది చివరిలో మెగాస్టార్ చిరంజీవి ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇలా రాంచరణ్ ఉపాసన పేరెంట్స్ కాబోతున్నారు అంటూ చిరంజీవి తెలియచేయడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన ఇన్ని రోజుల పాటు పిల్లల గురించి ప్లాన్ చేయకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. త్వరలోనే అమ్మను కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఉపాసన తెలిపారు.ఈ సమాజం కోరుకున్నట్లు కాకుండా తమకు వచ్చినప్పుడు పిల్లలను ప్లాన్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Upasana: పూర్తి ఆర్థిక భద్రత ఉంది…


10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపించింది. పిల్లలను ప్లాన్ చేయడానికి ఇదే బెస్ట్ టైం… ఎందుకంటే ఇప్పుడు మాకు పూర్తి ఆర్థిక భద్రత ఉందని తెలిపారు.ఇప్పుడు మా పిల్లలను మేము ఎంతో అద్భుతంగా చూసుకోవచ్చు. మా ఇద్దరి మధ్య జరిగిన పరస్పర అంగీకారం ఇక పిల్లలు కావాలి అంటూ మాపై కుటుంబ సభ్యులు ఒత్తిడి కూడా ఏమాత్రం తీసుకు రాలేదని ఈ సందర్భంగా ఉపాసన ఆర్థిక భద్రత వచ్చిన తర్వాతే పిల్లలను ప్లాన్ చేయాలని భావించినట్లు ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago