సీనియర్ నటుడు ఉత్తేజ్.. నటనలో మంచి ప్రావీణ్యుడు. అటు కామెడీ అయినా.. ఇటు సైడ్ క్యారెక్టర్లు అయినా తన పాత్రకు న్యాయం చేయగల ప్రబుద్దుడు. అతడి భార్య పద్మ ఈ మధ్య అనారోగ్యంతో.. క్యాన్సర్ బారిన పడిన చికిత్స తీసుకుంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. భార్య మరణం మానసికంగా ఉత్తేజ్ ని కుంగదీసింది.
ఆ శోకాన్ని చాలారోజుల వరకు వాళ్లు మరచిపోలేదు. మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ ప్రముఖులు పద్మ అంత్యక్రియలకు హాజరై ఉత్తేజ్ ని ఓదార్చారు. ఇక ఇన్ని రోజులకు వాళ్ల కళ్లల్లో ఆనందం వెల్లువిరిసింది. ఉత్తేజ్ కూతురు చేతన గర్భవతి.. ఆమె త్వరలోనే తల్లి కాబోతోంది. అయితే ఆమెకు ఇటీవల వైభంగా సీమంతం జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్ చిన్నకూతురు పాటు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసింది. చేతన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సింగర్స్ గీతా మాధురి, శృతి , తనీష్ సైతం హాజరయ్యారు. మరి కొద్ది రోజులలో చేతన పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. చిత్రం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది. ఆమె హీరోయిన్ గా మాత్రం విజయవంతం కాలేకపోయింది.
రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో.. ఉత్తేజ్ కూతురితో కొంతకాలం మాట్లాడలేదు. ఇప్పటికీ కూడా అది కొనసాగుతోందనే టాక్ ఉంది. ఇన్ స్టాలో పాట ఇలా పేర్కొంది.. త్వరలోనే నా హీరో లేదా హీరోయిన్ వస్తున్నారు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని.. కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది చేతన. ఇక ఈ వేడుకలో ప్రతీ ఒక్కరు ఎంతో సంతోషంగా కనిపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…