ఘనంగా ఉత్తేజ్ కూతురు సీమంతం వేడుకలు.. ఫొటోలు వైరల్..!

0
1175

సీనియ‌ర్ న‌టుడు ఉత్తేజ్.. నటనలో మంచి ప్రావీణ్యుడు. అటు కామెడీ అయినా.. ఇటు సైడ్ క్యారెక్టర్లు అయినా తన పాత్రకు న్యాయం చేయగల ప్రబుద్దుడు. అతడి భార్య పద్మ ఈ మధ్య అనారోగ్యంతో.. క్యాన్సర్ బారిన పడిన చికిత్స తీసుకుంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. భార్య మరణం మానసికంగా ఉత్తేజ్ ని కుంగదీసింది.

ఆ శోకాన్ని చాలారోజుల వరకు వాళ్లు మరచిపోలేదు. మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ ప్రముఖులు పద్మ అంత్యక్రియలకు హాజరై ఉత్తేజ్ ని ఓదార్చారు. ఇక ఇన్ని రోజులకు వాళ్ల కళ్లల్లో ఆనందం వెల్లువిరిసింది. ఉత్తేజ్ కూతురు చేతన గర్భవతి.. ఆమె త్వరలోనే తల్లి కాబోతోంది. అయితే ఆమెకు ఇటీవల వైభంగా సీమంతం జరిగింది.

దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్‌ చిన్నకూతురు పాటు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసింది. చేత‌న ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సింగర్స్ గీతా మాధురి, శృతి , తనీష్‌ సైతం హాజరయ్యారు. మ‌రి కొద్ది రోజుల‌లో చేత‌న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. చిత్రం సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది. ఆమె హీరోయిన్ గా మాత్రం విజయవంతం కాలేకపోయింది.

రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో.. ఉత్తేజ్ కూతురితో కొంతకాలం మాట్లాడలేదు. ఇప్పటికీ కూడా అది కొనసాగుతోందనే టాక్ ఉంది. ఇన్ స్టాలో పాట ఇలా పేర్కొంది.. త్వరలోనే నా హీరో లేదా హీరోయిన్‌ వస్తున్నారు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని.. కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది చేతన. ఇక ఈ వేడుకలో ప్రతీ ఒక్కరు ఎంతో సంతోషంగా కనిపించారు.