Mukku Avinash: ఘనంగా ముక్కు అవినాష్ భార్య అనుజా సీమంతం…. వైరల్ అవుతున్న వీడియో!

0
104

Mukku Avinash: ముక్కు అవినాష్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లి తెర కార్యక్రమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అవినాష్ జబర్దస్త్ కార్యక్రమంలో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే ఈయనకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేసేవారు. ఇకపోతే అవినాష్ గత రెండు సంవత్సరాల క్రితం అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వైరల్ అయ్యాయి పెళ్లి తర్వాత అవినాష్ తన భార్యతో కలిసి రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక తన భార్యతో కలిసి పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు.

Mukku Avinash: తల్లి కాబోతున్న అనూజ…


ఇకపోతే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇద్దరం ముగ్గురం కాబోతున్నాము అంటూ తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించారు. ఇలా తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేసినటువంటి ఈయన తాజాగా తన భార్యకు సీమంతపు వేడుకలను నిర్వహించినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే అవినాష్ తన భార్య సీమంతనికి సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.