Surekha Vani: చిరంజీవిని తాకగానే సురేఖ వాణి గుక్క పట్టి ఏడ్చారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఉత్తేజ్!

0
259

Surekha Vani: దసరా పండుగ సందర్భంగా హర్యానా గవర్నర్, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో హైదరాబాదులో అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ వచ్చిన విషయం తెలిసిందే.అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సెల్ఫీలు దిగడం కోసం ఎగబడ్డారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఫోటో సెషన్ ఆపివేయాలంటూ గరికపాటి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా మెగాస్టార్ చిరంజీవి పట్ల గరికపాటి అవమానకరంగా మాట్లాడటంతో పెద్ద ఎత్తున మెగా అభిమానులు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ విషయం స్పందిస్తూ గరికపాటి పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై నటుడు ఉత్తేజ్ స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర బ్లడ్ డొనేట్ చేయడం కోసం దాదాపు 300 మంది వరకు ఉంటారు. అయితే వారందరూ రక్త దానం చేసే వరకు అన్నయ్య అక్కడే కదలకుండా ఉంటారు. అక్కడికి వచ్చినవారు అన్నయ్యతో ఫోటో దిగడం కోసం ఎంతో ఆరాటపడుతుంటారు. అయితేకొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ ఆయనతో కలిసి ఫోటో దిగితే కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఫోటో వారి ఇంట్లో ఉంటుంది.

చిరంజీవి గారితో కలిసి ఫోటో దిగాము ఆ ఫోటో మాకు వస్తుందో లేదో అని భావన వారిలో ఉండదని, నెగిటివ్ లతో సహా ఫోటోలు పంపించేవారని వెల్లడించారు.ఇక తాను మొదటిసారి అన్నయ్యను తాకినప్పుడు తనకు తెలియకుండానే ఎంతో ఎమోషనల్ అయ్యానని ఇలా ఎంతోమంది అతనిని చూసి తాకితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారని అంత అభిమానం చిరంజీవి గారంటే అని తెలిపారు.
ప్రతిఫలాపేక్ష కోరని ప్రకృతి చిరంజీవి..

Surekha Vani:

ఇక నటి సురేఖ వాణి కూడా మొదటిసారి చిరంజీవి గారిని కలిసినప్పుడు ఇలాగే ఎమోషనల్ అయ్యారని ఈ సందర్భంగా ఉత్తేజ్ తెలిపారు. లాల్ బహుదూర్ స్టేడియంలో సురేఖ వాణి చిరంజీవి గారిని పట్టుకొని గుక్క పట్టి ఏడ్చిందని ఆయనని తాకినప్పుడు కలిగే సంతోషం పట్టలేనిదంటు ఈ సందర్భంగా ఉత్తేజ్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులలో చిరంజీవి ఒక స్టార్ మాత్రమే కాదు ఒక ప్రతిఫలాపేక్ష కోరని ప్రకృతిలా మారారని.. సేవ చేయడం లక్ష్యం కాకూడదని.. అది వ్యక్తిత్వం అంటూ మెగాస్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు.