ఆ బాలిక ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని ఆమె ఇంటి యజమానికి చెప్పింది. తాను తీసుకెళ్తానని చెప్పి ఆ యజమాని లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహరాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు వలస వచ్చారు ఓ దంపతులు.
అక్కడే ఇటుక బట్టీలో పని చేసుకుంటూ ఉండేవారు. వాళ్లకు 14 ఏళ్ల కూతురు ఉంది. ఆమె కూడా తల్లిదండ్రులకు ఆర్థికపరంగా ఉపయోగపడేందుకు థానే జిల్లా భివాండికి చెందిన ఒకరి ఇంట్లో పనికి కుదిరింది. ఈ క్రమంలో ఆమె ఆ ఇంట్లో ఇంటి పని, వంట పని చేస్తూ ఉండేది. అక్కడ అతడికి తన భార్య కూడా ఉంది. ఆ బాలిక అతడి భార్యతో క్లోజ్ గా ఉండేది.
ఓ రోజు అతడు ఆమెను తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తానని చెప్పి ఆ మైనర్ ను బైక్ ఎక్కించుకున్నాడు. అక్కడ నుంచి నేరుగా అతడు అంగావ్ అనే ప్రాంతంలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. ఎందుకు ఇక్కడకు తీసుకొచ్చావ్ అంటూ ఆ బాలిక ప్రతిఘటించింది. ఆ బాలికను బెదిరించి.. బలవంతంగా దాడి చేస్తూ.. అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. తర్వాత బాధితురాలి తల్లిదండ్రుల వద్ద ఆ బాలికను వదిలేశాడు. ఆ బాలికకు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు.. మరికొన్ని సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదయ్యాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…