Featured

Vadde Naveen : ఎన్టీఆర్, వడ్డే నవీన్ లు ఇంత దగ్గరి బంధువులా? నందమూరి కుటుంబానికి దూరమవ్వడానికి కారణం ఏమిటి ?

Vadde Naveen : 97 లో వచ్చిన ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వడ్డే నవీన్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఇక లవర్ బాయ్ ఇమేజ్ తో ఆ తరువాత ‘పెళ్లి’ సినిమాతో కూడా మళ్ళీ మంచి హిట్ కొట్టాడు. దీంతో వడ్డే నవీన్ కెరీర్ దూసుకుపోయింది. ఎంత త్వరగా స్టార్ అయ్యాడో అంతే త్వరగా ఫేడ్ అవుట్ కూడా అయ్యాడు. మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే మంచి సినిమాతో ఇవ్వాలని అనుకుంటున్న నవీన్ కి నందమూరి కుటుంబంతో ఉన్న బంధం గురించి చాలా మందికి తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ బావ అవుతాడన్న విషయం చాలా మందికి తెలీదు.

ఎన్టీఆర్ సోదరితో నవీన్ వివాహం…

వడ్డే నవీన్ వడ్డే రమేష్ గారి అబ్బాయి, ముందు నుండి సినిమా పరిచయాల వల్ల వడ్డే నవీన్ కి సినిమాల మీద ఆసక్తి ఉంది. ఇక సినిమాలలోకి వచ్చే ముందే నందమూరి ఇంటి అమ్మోని ప్రేమించాడట. జూనియర్ ఎన్టిఆర్ వడ్డే నవీన్ కి ముందు నుండి మంచి స్నేహితుడంటూ చెప్తుంటారు. అలా సినిమాల్లోకి వచ్చాక కొద్దిరోజులకు సీనియర్ ఎన్టీఆర్ గారి అబ్బాయి రామకృష్ణ కూతురును ఇచ్చి వడ్డే నవీన్ కు పెళ్లి చేసారు. ఇక స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్, వడ్డే నవీన్ కాస్త బంధువులు అయ్యారు.

ఇక వ్యక్తిగత కారణాలతో వడ్డే నవీన్ అయన భార్య విడిపోయారు. ఇక సినిమాల్లో కూడా వడ్డే నవీన్ మెల్లగా కనుమరుగయ్యారు. ఒకప్పుడు మంచి హిట్స్ అందుకుని ఒక వెలుగు వెలిగిన హీరో లవర్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకుని, ఫ్యామిలీ హీరోగా మారిన వడ్డే నవీన్ టాప్ హీల్లో ఒకడిగా ఉండాల్సిన వాడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మళ్ళీ మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని భావించి కథల విషయంలో జాగ్రత్తగా ఉన్నారట నవీన్.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago