Varudu Kavalenu: ‘వరుడు కావలెను’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే?
Varudu Kavalenu: నాగ శౌర్య , రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా డిసెంబర్ 24 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ అవేవి నిజం కాలేదు.. ప్రస్తుతం లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. రాబోయే ఈ చిత్రం జనవరి 7, 2022న ఓటీటీలో రానుంది.
ఈ రొమాంటిక్ మరియు ఫ్యామిలీ డ్రామాకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. కాగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రం జనవరి 7వ తేదీ నుంచి జీ5లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ వార్తలను జీ5 అధికారికంగా కూడా వెల్లడించింది.
‘వరుడు కావలెను’ చిత్రం అక్టోబర్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఆ సినిమాలో నాగశౌర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ ముఖ్యపాత్రల్లో నటించారు. వరుడు కావలెను చిత్రానికంటే ముందు నాగ శౌర్య నటించిన చిత్రం లక్ష్య.. ఇది స్పోర్ట్ డ్రామాగా తెరెకెక్కింది. కానీ ఆశించినంత హిట్ కాలేకపోయంది.
ఇక నాగశౌర్య తదుపరి చిత్రం అనీష్ కృష్ణతో కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అతను గాయనిగా మారిన నటి షిర్లీ సెటియాతో రొమాన్స్ చేయనున్నాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషాముల్పూరి దీనిని నిర్మించగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నాడు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…