Ghani: వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గని’ విడుదల తేదీ వచ్చేసింది..వైరల్ అవుతున్న పోస్టర్..!
Ghani: మెగా బ్రదర్ నాగబాబు వారసుడు.. వరుణ్ తేజ్ రాబోయే చిత్రం.. గని. ఈ చిత్రం విడుదల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మార్చి 18, 2022న ప్రేక్షకుల ముందుకు రానుందని.. ఇదే విషయాన్ని మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేసి ప్రకటించారు.
ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 3 న అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. తర్వాత మళ్లీ డిసెంబర్ 24, 2021న విడుదల కావాల్సి ఉంది.. అయితే అల్లు అర్జున్ పుష్ప , రణ్‌వీర్ సింగ్‌ల 83 చిత్రాలు ఉండటంతో.. ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.
దీనిలో హీరో వరుణ్ బాక్సర్ గాకనిపించబోతున్నాడు. ఇక బాక్సింగ్ ఆధారంగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామాకి కిరణ్ కొర్రపాటి రచన , దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ గత రెండేళ్లుగా గనీ కోసం ప్రిపేర్ అయ్యి షూటింగ్ చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. అంతే కాదు.. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో ఇబ్బందుల కూడా పడ్డామని కూడా మేకర్స్ వెల్లడించారు.
గీతా ఆర్ట్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. నాకౌంట్ పంచ్ కోసం గనీ రెడీగా ఉన్నాడు.. అంటూ ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నదియా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…