గూడుపుఠాణి రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది కమెడియన్లు హీరోలు గా మారి ప్రేక్షకులను అలరించారు. కొంతమంది హీరోలు గా మారి సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో కమెడియన్ సప్తగిరి కూడా ఒకరు. కమెడియన్ సప్తగిరి ఇప్పటివరకు పలు రకాల సినిమాలలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే తాజాగా సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గూడుపుఠాని. ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల అయింది.
కథ : హీరో సప్తగిరి హీరోయిన్ నేహా సోలంకి తో ప్రేమలో పడతాడు. అనంతరం పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. అనుకున్న విధంగానే ఒక పురాతన అమ్మవారి దేవాలయం కి వెళ్లి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. ఇంతకుముందు దేవాలయాల్లో వరుసగా అమ్మవారి నగలు దొంగిలించ బడతాయి. సప్తగిరి పెళ్లి చేసుకునే గుడిలోనే దొంగలు పడతారు. దీంతో ఆ పెళ్లి జరుగుతుందా?లేదా? ఆ గుడి లో పడిన దొంగలు ఎవరు అనేది అసలు కథ.
ఎవరు ఎలా చేశారంటే : ఎప్పటిలాగే సప్తగిరి తన నటనతో అందరిని అలరిస్తాడు. ఇందులో రఘు కుంచే నటన హైలెట్ గా నిలుస్తుంది. అలాగే హీరోయిన్ కూడా తన నటనతో రక్షకులు బాగానే ఆకట్టుకుంటుంది. మొత్తానికి గూడుపుఠాణి సినిమా ప్రేక్షకులకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ఈ సినిమా ఫ్యామిలీతో తప్పకుండా చూడవచ్చు.
టైటిల్: గూడుపుఠాణి
నటీనటులు: సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచే తదితరులు
నిర్మాణ సంస్థ: ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
దర్శకత్వం: కెయమ్ కుమార్
సంగీతం: ప్రతాప్ విద్య
విడుదల తేది: డిసెంబర్ 25, 2021
రేటింగ్ : 3/5
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…