Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల నటి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టారు. ఇలా ఈమె మెగా ఇంటి కోడలు అయిన తర్వాత లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సిరీస్ ప్రస్తుతం ప్రసారమవుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఎమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా వరుణ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. వరుణ్ తేజ్ మీకు మొదట ఎలా ప్రపోజ్ చేశారు అనే ప్రశ్నలు ఎదురు కావడంతో ఈమె ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలియజేశారు.
వరుణ్ లావణ్య కలిసి నటించిన సినిమాల సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని అయితే వీరి లవ్ జర్నీలో ప్రపోజల్ అనేవి లేవని తెలిపారు కానీ అప్పటివరకు నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు అయితే తనకు ప్రపోజ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించింది అంటూ లావణ్య తెలిపారు. ఆయన తన తొలిప్రేమ సినిమా స్టైల్ లోనే నాకు ప్రపోజ్ చేశారని లావణ్య తెలిపారు.
రింగ్ తో ప్రపోజ్ చేశారు..
తొలిప్రేమ సినిమాలో చివరిలో ఒక రింగ్ తీసుకొని రాశి ఖన్నాకు ఏ విధంగా అయితే ప్రపోజ్ చేశారో అలాగే రింగ్ తీసుకొని వచ్చి మోకాళ్ళపై కూర్చొని ఆయన నాకు ప్రపోజ్ చేశారని తెలిపారు. ఇలా వరుణ్ ప్రపోజల్ గురించి లావణ్య త్రిపాఠి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…