Anushka Shetty: అనుష్క శెట్టి పరిచయం అవసరం లేని పేరు నాగార్జున పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇలా సూపర్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనుష్క అనంతరం అరుంధతి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలోను ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సందడి చేసిన ఈమె బాహుబలి సినిమాతో మరింత సక్సెస్ సాధించారు. ఈ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఇక అనుష్క నటించిన అరుంధతి సినిమా ఏ స్థాయిలో అయితే సక్సెస్ అందుకుందో అదే విధంగా భాగమతి సినిమా కూడా సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమా అప్పట్లోనే 40 కోట్ల షేర్స్ రాబట్టాయి ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో కొంత భాగం అనుష్క డైరెక్షన్ చేశారని తెలుస్తుంది ముఖ్యంగా అనుష్క పాత్రకు సంబంధించిన సన్నివేశాలు అన్నిటిని ఆమె డైరెక్ట్ చేసుకున్నారట డైరెక్టర్ అందుబాటు లేని సమయంలో అనుష్కని ఈ సినిమాకు దర్శకత్వం వహించారని సమాచారం.
భాగమతి…
ఇక ఈ విషయం ఇన్ని రోజుల తర్వాత బయటపడటంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మా స్వీటీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ సంబరపడుతున్నారు. ఇలా డైరెక్టర్ గా ఈమె చేసిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడం విశేషం. ఇక బాహుబలి తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి అనుష్క ప్రస్తుతం తిరిగి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…