Nikhil: హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు నటుడు నిఖిల్. ఈ సినిమా ద్వారా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నిఖిల్ అనంతరం సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇటీవల నిఖిల్ నటించిన కార్తికేయ2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా నటుడిగా ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నటువంటి ఈయన త్వరలోనే తండ్రి కాబోతున్నారు. నిఖిల్ 2020 వ సంవత్సరంలో డాక్టర్ పల్లవిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇలా మూడు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పబోతున్నారు.
ఈ క్రమంలోనే నిఖిల్ ఇటీవల తన భార్య పల్లవి సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా పల్లవి అండ్ నిఖిల్ ఫ్రెండ్స్ పుట్టబోయే బిడ్డకు డైపర్లు ఎలా మార్చాలి అనే విషయం గురించి తనకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.
డైపర్లు మారుస్తున్న నిఖిల్…
పల్లవి నిఖిల్ స్నేహితులు మరోసారి వీరిద్దరికీ పార్టీ ఇచ్చారు. ఇందులో భాగంగా పుట్టబోయే బిడ్డకు డైపర్లు ఎలా మార్చడం గురించి నిఖిల్ కి స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఒక జిరాఫీ బొమ్మకు డైపర్లు ఎలా వేయాలో నేర్పించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…