AP Politics: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది మరొక మూడు రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయనే చెప్పాలి ఒకవైపు కూటమి సభ్యులు పోటీకి దిగగా మరోవైపు వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగారు.
ఇలా పార్టీలన్నీ ఒకవైపు జగన్ ఒకవైపు నిలబడి ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో అందరి ఆసక్తి ఏపీ ఎన్నికలపైనే ఉంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో గెలుపు ఓటముల గురించి ఇప్పటికే ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున చర్చలు జరపడమే కాకుండా భారీ స్థాయిలో బెట్టింగులు కూడా కడుతున్నారు. అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందినటువంటి వేణు స్వామి సైతం వచ్చే ఎన్నికలలో గెలుపు ఎవరిది అనే విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.
వేణు స్వామి జ్యోతిష్యం ప్రకారం ఎన్డీయే కూటమికి షాక్ తప్పదట. మరలా వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపడతాడట. పవన్ కళ్యాణ్-చంద్రబాబు జాతకాల రీత్యా పొత్తు వలన పెద్దగా ప్రయోజనం లేదని ఆయన అంటున్నారు. ఇక వేణు స్వామి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ తప్పకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోతారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కు ఆ యోగ్యం లేదు…
గ్రహాల రీత్యా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లవి ప్రతికూల నక్షత్రాలు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రెండు నక్షత్రాలకు అసలు పొసగదు. ఈ ప్రభావం కూటమిపై అసలు చూపించదు. ఇక 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని పవన్ కళ్యాణ్ జాతకం రీత్య ఆయనకు సీఎం అయ్యే యోగ్యమే లేదని తెలిపారు. ఇక పిఠాపురంలో ఆయన గెలుస్తారా లేదా అన్న విషయంపై వేణు స్వామి మాట్లాడలేదు. దీంతో వేణు స్వామి చేసిన కామెంట్ లు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…