Venu Thottempudi : నేను మొహమాటానికి పోయి కెరీర్ పాడుచేసుకున్నాను… ఇప్పటికీ నాకు చాలా బాధ ఉంది : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : 1999 లో వచ్చిన ‘స్వయం వరం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో వేణు ఆ తరువాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఉరేళితే, కళ్యాణ రాముడు, సదా మీ సేవలో వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. అయితే ‘దమ్ము’ సినిమా తరువాత ఇండస్ట్రీకి దూరమైన వేణు దాదాపు తోమిదేళ్ల తరువాత మళ్ళీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. అయితే సినిమాల్లోకి వచ్చిన మొదట్లో మొహమాటం వల్ల వేణు ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే కొన్ని మంచి స్క్రిప్ట్లను ఎలా వదులుకోవాల్సి వచ్చిందో వేణు వివరించారు.

మొహమాటం వల్ల కెరీర్ పోయింది…

చిరునవ్వుతో సినిమా 175 రోజులు ఆడడటంతో మంచి అవకాశాలు వచ్చాయి. మొదట అశ్వినిదత్ గారు పిలిచి ఈవివి గారితో సినిమా ప్లాన్ చేద్దాం అని స్క్రిప్ట్ చెప్పాక నచ్చడంతో ఒప్పుకున్నాను. ఇక రెండు రోజుల తరువాత పూరి జగన్నాథ్ నా దగ్గరికి వచ్చి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ వినిపించాడు. చాలా నచ్చింది స్క్రిప్ట్. అశ్వినిదత్ గారికి పూరి స్క్రిప్ట్ చెప్పడం ఆ సినిమా స్క్రిప్ట్ నచ్చింది అంటే అశ్వనిదత్ గారు అదేంటి మనం ఆల్రడీ సినిమా చేయాలని అనుకున్నాం కదా మాటిచ్చావ్ కదా అనడం తో పూరి సినిమా వదులుకుని అశ్వినిదత్, ఈవివి గారితో సినిమాకు ఓకే చెప్పాను.

చివరికి అశ్వినిదత్ ప్రాజెక్ట్ పోయింది. ఈవివి గారికి అశ్వినిదత్ గారికి ఏవో క్లాషెస్ వల్ల సినిమా ఆగిపోయింది. నేను చిరునవ్వుతో వంటి మంచి హిట్ ఇచ్చి ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇక ఈవివి గారు ముహూర్తం షాట్ కి రా మనం సినిమా చేదాం అన్నారు. వెళ్ళాక కథ మార్చారని అర్థమై, అడిగితే నీ ఇమేజ్ కి ప్లస్ అయ్యే కథనే నాకు తెలుసు కదా అనడం తో ‘ వీడేవడండి బాబు’ సినిమా చేశాను. ఆ సినిమా విషయంలో చాలా బాధపడ్డాను ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమా పోయిన దానికంటే వీడేవడండి బాబు సినిమా చేసినందుకు బాధేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకుంటాము కానీ ఆ మాట నిల్పుకునే సందర్భం కూడా కరెక్ట్ గా ఉండాలని అర్థమైంది. ఇండస్ట్రీ లో గైడన్స్ ఇచ్చేవారు ఎవరూ లేని రోజుల్లో అలా జరిగింది అంటూ వేణు చెప్పారు.