Vijay Devarakonda clarity on Betting apps promotions
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో నమోదైన ఫిర్యాదుతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నేడు Enforcement Directorate (ED) విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ, ఈ కేసులో తన పాత్ర మరియు వాస్తవాలను స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, దేశంలో బెట్టింగ్ యాప్‌లు మరియు గేమింగ్ యాప్‌లు అనే రెండు వేర్వేరు విభాగాలు ఉన్నాయని తెలిపారు. తాను ప్రమోట్ చేసినది A23 గేమింగ్ యాప్ మాత్రమేనని, అది పూర్తిగా లీగల్ అని క్లారిటీ ఇచ్చారు. గేమింగ్ యాప్‌లకు ప్రభుత్వం నుండి అనుమతులు, రిజిస్ట్రేషన్, టాక్స్, జీఎస్టీ అన్నీ ఉంటాయని చెప్పారు. ఇవి దేశంలో ఐపీఎల్, కబడ్డీ, వాలీబాల్ వంటి ప్రధాన క్రీడలకు కూడా స్పాన్సర్ చేస్తున్నాయని ఆయన వివరించారు. అలాగే, తాను చేసుకున్న కాంట్రాక్ట్, అందుకున్న చెల్లింపుల వివరాలు, బ్యాంకు లావాదేవీలన్నీ ఇప్పటికే ఈడీకి సమర్పించినట్లు తెలిపారు.
తాను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో అసలు ఓపెన్ కాదని విజయ్ పేర్కొన్నారు. తాను ఎప్పుడూ చట్టబద్ధంగా ఉన్న గేమింగ్ యాప్‌లను మాత్రమే ప్రమోట్ చేశానని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో తన పేరు రావడం వల్లనే విచారణకు పిలిచారని తెలిపారు.
ఈ బెట్టింగ్ యాప్ కేసులో విజయ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. వారిలో రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయాని పావని, నేహా పఠాన్, హర్షసాయి, రీతు చౌదరి, శ్యామల, యూట్యూబర్ లోకల్ బాయ్ నాని వంటి వారున్నారు. వీరిలో కొందరిని ఈడీ ఇప్పటికే పలు మార్లు విచారించింది.
ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను సంపాదించింది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా, సత్యదేవ్ అతని అన్న పాత్రలో కనిపించారు. అన్నదమ్ముల బంధం నేపథ్యంగా నడిచిన ఈ మూవీలో మొదటి భాగం ఆకట్టుకున్నప్పటికీ, రెండో భాగం కొంత నెమ్మదిగా ఉందని ప్రేక్షకుల టాక్.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…