Featured

Rashmika -Vijay Devarakonda: ఓకే డ్రెస్ వేసుకొని అడ్డంగా దొరికిపోయిన విజయ్ రష్మిక… రిలేషన్ లో ఉన్నట్టేగా?

Rashmika -Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ లో ఉన్నారని అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు అంటూ పెద్ద ఎత్తున వీరి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు అప్పటినుంచి వీరి గురించి ఇలాంటి వార్తలు వైరల్ అవుతూ ఉన్నా కానీ వీరిద్దరు మాత్రం ఈ న్యూస్ ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. కానీ వీరి వ్యవహారి శైలి చూస్తే మాత్రం త్వరలోనే రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి కోడలుగా వెళ్లబోతుందని మాత్రం తెలుస్తుంది.

రష్మిక విజయ్ దేవరకొండ కలిసి వెకేషన్ లకు వెళ్లడం తన ఫ్యామిలీతో కలిసి రష్మిక వెళ్లడం అంతేకాకుండా విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే వేడుకలకు రష్మిక హాజరు కావడం జరుగుతుంది. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలలో బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ ఒకేలా ఉండడంతో తరచూ బయటపడుతూ ఉంటారు. ఇక గత కొద్ది రోజుల క్రితం యానిమల్ ప్రమోషన్లలో కూడా మా ఇల్లు అంటూ విజయ్ దేవరకొండ ఇంటిని ఉద్దేశిస్తూ ఈమె మాట్లాడారు.

విజయ్ తల్లి తనకు సెకండ్ మదర్ అంటూ కూడా చెప్పడంతో ఈమె దేవరకొండ కోడలిగా ఫిక్స్ అంటూ వార్తలను వైరల్ చేశారు అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ రౌడీ వేర్ అనే ఒక క్లాత్ బ్రాండ్ ద్వారా బిజినెస్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ కూడా రౌడీ వేర్ ధరించి కనిపించారు.

తెరపైకి రిలేషన్ రూమర్స్

రష్మిక రౌడీ వేర్ బ్రాండ్ కి సంబంధించినటువంటి హుడి వేసుకుని ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఒక్కసారిగా ఈమెను చూసినటువంటి వారందరూ విజయ్ దేవరకొండ అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఈమె నవ్వుతూ బయటకు వెళ్లిపోయారు. ఇక తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో రష్మిక లాంటి డ్రెస్సును విజయ్ దేవరకొండ వేసుకొని కనిపించారు. దీంతో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ మరోసారి తెరపైకి వార్తలు వచ్చాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

9 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

10 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

11 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

12 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

12 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

12 hours ago