Vijay Deverakonda's "Kingdom" is creating records with pre-bookings alone
హైదరాబాద్: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కింగ్డమ్’ మరో 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్పై యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తో పాటు విడుదలైన ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసింది.
అదే ఉత్సాహం బాక్సాఫీస్ వద్ద కూడా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితమే ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. టికెట్లు హాట్‌కేక్స్‌లా అమ్ముడవుతున్నాయి. Sacnilk నివేదికల ప్రకారం, ప్రీ సేల్ బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.13 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో రూ.5 కోట్లు విదేశీ మార్కెట్ నుంచే వచ్చాయి. ట్రేడ్ నిపుణులు ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో ఇది అతి పెద్ద ప్రీ సేల్‌గా గుర్తిస్తున్నారు. ప్రీమియర్ షోలు, ప్రీ సేల్స్ కలిపి తొలి రోజే రూ.18-20 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా.
ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ‘కింగ్డమ్’ అడ్వాన్స్ సేల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే $485,000 (సుమారు రూ.4.22 కోట్లు) వసూలు చేసింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌లో 75 అడుగుల భారీ కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశారు, ఇది సినిమాపై ఉన్న అంచనాలకు నిదర్శనం.
‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌లో స్టార్‌డమ్ అందుకున్న విజయ్ దేవరకొండకు ఆ తరువాత వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు ఆశించినంత విజయాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో, ‘కింగ్డమ్’ విజయ్ కెరీర్‌కు మళ్లీ అలాంటి బ్లాక్‌బస్టర్ ఇమేజ్ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
గ్యాంగ్‌స్టర్ డ్రామా, బ్రదర్ సెంటిమెంట్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో విజయ్ లుక్, యాక్షన్ సీక్వెన్సులు, అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బీజీఎమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలో విజయ్ కొత్త యాంగిల్‌లో కనిపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, మహేష్ ఆచంట తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే, ఇప్పటికే ఈ సినిమా చూసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘కింగ్డమ్ పక్కా హిట్ అవుతుందని’ ధీమా వ్యక్తం చేశారు. విజయ్ నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడం, ముఖ్యంగా జైలు ఎపిసోడ్‌లోని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. సందీప్ రెడ్డి వంగా-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అందుకే ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదటి రోజు వసూళ్లు, వర్డ్ ఆఫ్ మౌత్‌పై ఆధారపడి ఈ సినిమా విజయ్ కెరీర్‌లో మరో మలుపు కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘కింగ్డమ్’ విజయం సాధించి విజయ్ దేవరకొండకు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందో లేదో చూడాలి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…