హైదరాబాద్: యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తనపై వచ్చే ట్రోల్స్, నెగటివ్ కామెంట్లకు ఘాటుగా స్పందించడం కూడా ఆమె ప్రత్యేకత. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్, ముఖ్యంగా మహిళలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై ఒక ఎమోషనల్ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అనసూయ తన లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, “ఇటీవలి కాలంలో కొందరు మహిళలు యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా నాపై వ్యక్తిగతంగా రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఇప్పటివరకు అలాంటి కామెంట్లు, వీడియోలపై ఎక్కువగా సైలెంట్‌గా ఉన్నా, మహిళల నుంచే ఇలాంటి వ్యక్తిగత దాడులు రావడం తట్టుకోలేకపోతున్నా. నేను ఒక తల్లిగా, భార్యగా, మహిళగా నా బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్నాను. అదే సమయంలో నాకు నచ్చినట్టుగా డ్రెస్సులు వేసుకుంటాను. దాంతో మీకు ఇబ్బంది ఏమిటి?” అని ప్రశ్నించారు.
ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్‌ను సమర్థించుకుంటూ, “నేను ఒక యాక్టర్‌ని. నా డ్రెస్సింగ్ నా స్టైల్, గ్లామర్, కాన్ఫిడెన్స్‌లో భాగం. నేను తల్లి అయ్యానని నా వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా? నా ఫ్యామిలీ, నా పిల్లలు నేను ఎలా ఉన్నా అలాగే ప్రేమిస్తారు. వాళ్లు నన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. నేను పాష్‌గా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తే కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నా డ్రెస్‌ల ఆధారంగా నేను విలువలు కోల్పోయానని అనుకోవడం తప్పుడు అభిప్రాయం” అని స్పష్టం చేశారు.
అనసూయ తన లేఖను ముగిస్తూ, “నేను ఎవరికీ నా లైఫ్‌స్టైల్‌ను ఫోర్స్ చేయడం లేదు. మీకు నచ్చినట్టు మీరు లైఫ్ గడపండి, నేను తీర్పు ఇవ్వను. అదే విధంగా నాపై కూడా గౌరవం చూపాలి. మన మధ్య ఉన్న తేడాలను దాడులుగా మార్చకుండా అంగీకరించగలిగితే మనందరం హ్యాపీగా జీవించగలం” అని పేర్కొన్నారు.
ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ ఫ్యాన్స్ మరియు నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఈ లేఖతోనైనా ఆమెపై వస్తున్న ట్రోలింగ్ తగ్గుతుందో లేదో చూడాలి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…