Movie News

విజయ్–రష్మిక పెళ్లి రాజస్థాన్‌లో ఘనంగా.. అతిథులందరికీ ప్రత్యేక నిబంధనలు!

 సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పేర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తుండగా, తాజాగా వచ్చిన సమాచారం మరింత ఆసక్తి రేపుతోంది.

తెలుగు ప్రేక్షకులకు ‘గీతా గోవిందం’ సినిమాతో హిట్ జంటగా గుర్తింపు పొందిన వీరిద్దరి మధ్య అప్పటి నుంచే స్నేహం కాస్త బలపడిందనే ప్రచారం సాగింది. అయితే ఇప్పటివరకు తమ వ్యక్తిగత సంబంధంపై ఈ జంట ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కానీ ఫిబ్రవరి 26న వివాహం జరగనుందని వెలువడిన సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

తెలుసుకున్న వివరాల ప్రకారం, ఈ వివాహం హైదరాబాద్‌లో కాకుండా రాజస్థాన్‌లోని ఉదయపూర్లో అత్యంత వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయుల సమక్షంలో జరగనుంది. రాజస్ధాన్ ప్యాలెస్‌ల మధ్య జరిగే ఈ వేడుకను పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్, నటుడు అల్లు అర్జున్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ వంటి కొంతమంది ప్రముఖులు మాత్రమే ఆహ్వానితుల జాబితాలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ పెళ్లి విషయంలో ఒక ఆసక్తికర అంశం చర్చనీయాంశమైంది. వివాహానికి హాజరయ్యే అతిథులందరికీ కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయనున్నారట. ముఖ్యంగా ఫోన్‌లు, కెమెరాలు మండపం పరిసరాల్లోకి అనుమతించబోవడం లేదని సమాచారం. ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయరాదని స్పష్టంగా సూచించనున్నట్లు తెలుస్తోంది. ఈ నియమాలు అందరికీ సమానంగా వర్తిస్తాయని, అందులో సీఎం సహా ప్రముఖులు కూడా మినహాయింపు కాదని చెబుతున్నారు.

వివాహ వేడుక పూర్తిగా వ్యక్తిగతంగా, మీడియా దృష్టికి దూరంగా జరగాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒక ఇంటర్వ్యూలో రష్మిక ‘కను దిష్టి’ గురించి తన నమ్మకాన్ని వ్యక్తం చేసిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అందుకే తమ పెళ్లి ఫోటోలు ముందుగా బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి, ఈ వివాహం అధికారికంగా ఎలా ప్రకటిస్తారు? వేడుక అనంతరం ఫోటోలు విడుదల చేస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం సినీ వర్గాల్లో ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ హాట్ టాపిక్‌గా మారింది.

Revathi P

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

7 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

8 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

8 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

8 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

8 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

8 hours ago