General News

భార్యను చిత్రహింసలకు గురిచేసిన శాడిస్టు భర్త.. దేని కోసమో తెలుసా..

విజయవాడకు చెందిన జ్యోత్స్న ఎంబీఏ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. అక్కడనే సుశాంత్ చౌదరి అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమె దానికి అంగీకరించలేదు. కానీ తర్వాత అతడు చనిపోతానని బెదిరించడంతో ఆమె అతడి ప్రేమకు లొంగడం తప్పలేదు. దీంతో ఇద్దరు కలిసి ఓ రోజు నెల్లూరులోని కామాక్షి దేవాలయంలో దండలు మార్చుకొని.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలవడంతో విజయవాడలోనే బంధువలందరినీ పిలిపించి ఘనంగా రిసెప్షన్ చేయించారు. అతడికి బాగానే కట్నకానుకలు కూడా ముట్టజెప్పారు. తర్వాత బెంగళూరుకు వెళ్లి అక్కడే కాపురం పెట్టారు. తర్వాత కొన్నాళ్లకు నెల్లూరుకు వచ్చి అతడి తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువ అయ్యాయి.

ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయని.. అవి దక్కాలంటే తనకు పుట్టే పిల్లల్ని బలివ్వాలంటూ చెప్పాడు ఓ మాంత్రికుడు. దీంతో ఆమెను భర్త, అత్త, ఆడబిడ్డలు ఆమెను చిత్రహింసలు పెట్టసాగారు. త్వరగా పిల్లలను కనాలని.. కని తనకు ఇస్తే బలి ఇచ్చి లంకె బిందెలను తన సొంతం చేసుకుంటానని ఆమెను వేధించాడు. ఇంట్లో ముగ్గు పోసి ఆమెను మధ్యలో కూర్చోబెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.

దీంతో యువతి తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో మళ్లీ బెంగళూరలో కాపురం పెట్టాడు. అక్కడ కూడా ఆమెను పట్టించుకోకుండా మరో ఇద్దరు యువతులతో లవ్ అఫైర్ పెట్టుకుంటూ.. పిల్లల్ని కని ఇస్తావా.. లేదా వాళ్లతో కని తీసుకుంటా అంటూ బెదిరించాడు. దీంతో ఆమె తన భర్త ఆగడాలను భరించలేక విజయవాడలోని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకోని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago