సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం అని చెప్పవచ్చు.అయితే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల కొందరికి ఎన్నో సంబంధాలు వస్తున్నప్పటికీ వివాహం జరగదు. అలాంటివారు ఎన్నో పూజలు హోమాలు చేస్తుంటారు. అయినప్పటికీ కొందరికి పెళ్లి కుదిరక తీవ్ర నిరాశ చెందుతుంటారు. ఆ విధంగా వివాహం ఆలస్యం అయ్యేవారు ఆంజనేయస్వామికి శనివారం లేదా మంగళవారం ఈ విధంగా పూజించడం వల్ల వివాహ గడియలు దగ్గర పడతాయి అని చెప్పవచ్చు.అయితే ఆ ఆంజనేయుడిని పూజించడం వల్ల ఎలాంటి శుభపరిణామాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
పెళ్లి చూపులలో ఆకర్షితులై వివాహం కుదరనివారు శనివారం లేదా మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి, స్వామి వారి ఆలయంలో బియ్యపు పిండితో తయారు చేసిన ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయటం వల్ల వివాహ గడియలు దగ్గర పడతాయి. అదేవిధంగా నరదృష్టి తొలగిపోయి, శత్రువుల పై విజయం సాధించాలంటే స్వామి వారి ఆలయంలో పొట్టుతీయని మినుముల పొడితో తయారు చేసిన ప్రమిదలో దీపారాధన చేయటం వల్ల విజయం సాధిస్తారు.
అనారోగ్య సమస్యలతో బాధపడేవారు స్వామివారి ఎదుట ఆవనూనెతో ప్రమిదను వెలిగించి పూజించాలి. అదే విధంగా మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే స్వామివారి ఎదుట బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్లలో కలిపి తయారు చేసిన ప్రమిదలో దీపారాధన చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా ఆంజనేయ స్వామిని శని లేదా మంగళవారం ఈ విధంగా పూజించడం వల్ల మనం అనుకున్న పనులు ఏ ఆటంకం లేకుండా కలుగుతాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…